విశాఖ టీడీపీకి త్వ‌ర‌లో  షాక్ తగలబోతోంది. ఆ పార్టీ అర్బన్ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కోన తాతా రావు సైకిల్ దిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ స‌మ‌క్షంలో  జనసేన తీర్ధం  పుచ్చుకునేందుకు రెడీ అంటున్నారు. టీడీపీ తరఫున జీవీఎంసీ లో ఫ్లోర్ లీడర్ కూడా పనిచేసిన తాతారావు అధినేత బాబు వైఖరిపై గత కొంత కాలంగా గుర్రు మీదున్నారు.  2014 లో తనను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి గాజువాక ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో తాతా రావు  షాక్ తిన్నారు. వచ్చేసారి నీకే టిక్కెట్ అని అధినాయకుడు నచ్చచెప్పేసరికి సర్దుకున్న అయన కు 2019 లో కూడా టిక్కెట్ దక్కదని తేలిపోవడంతో ఈ సారి ఏకంగా బాబుకే షాక్ ఇవ్వాలనుకుంటున్నారు.  వైసీపీ లోకి పోదామంటే అక్కడ పాత కాపులు సిద్ధంగా వున్నారు. దాంతో కొత్త పార్టీ జన సేన కు సై అంటున్నారు.
Image result for కోన తాతా రావు
తొలి వికెట్  పడనుందా 
నగరంలో బలమైన సామాజిక వర్గమైన యాదవ కులానికి చెందిన తాతారావు పార్టీకి  గుడ్ బై అంటే  టీడీపీకి గట్టిగా దెబ్బె పడినట్లే. ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలల్లోను భారీగా పడితే సైకిల్ పార్టీ  పంచర్ అవడం ఖాయం. అలాగే టీడీపీ నుంచి జన సేనకు తాతా రావు బాటలో మరింత మంది క్యూ కడితే అది మరింత డేంజర్. గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు కు కూడ ఇది షాకింగ్ న్యూసే. 
Image result for jenasena
పవన్ టూర్ లో కండువా సీన్
త్వరలో విశాఖలో  జరిగే పవన్ ప్రజా పోరాట యాత్రలో కండువా కప్పేసుకునేందుకు తాతారావు వ‌ర్గం తహ తహ లాడుతోంది. తాజాగా బర్త్ డే జరుపుకున్న ఆయన  కొత్త రాజకీయం చూస్తారంటూ అనుచరులకు అపుడే ట్రైలర్ చూపించేశారు. తాతారావు తరహాలో మరెంత మంది తమ్ముళ్ళు టీడీపీకి షాక్ ఇస్తారో. అసలే అర్బన్ జిల్లా టీడీపీలో డిష్యూం డిష్యూం సీన్లే ఎక్కువ. మంత్రులిద్దరికే చెడిన పరిస్థితులలో తమ్ముళ్ళ లాంగ్ జంపులను ఆపేంత సీన్ లేదు. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: