ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి అంటే కుస్తీ పోటీ కాద‌ని టిడిపి నేత ఎస్సీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ జూపూడి ప్ర‌భాక‌ర్ పంచ్ విసిరారు. బాడీ ఫిట్ నెస్ అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడ విడుద‌ల చేసిన వీడియోల‌పై జూపూడి స్పందించారు. వీడియోల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, నేత‌లు పెంచాల్సింది బాడీని కాద‌ని బుర్ర‌లు అంటూ ఎద్దేవా చేశారు. బ్యాంకుల‌ను దోచుకున్న‌వారిని మోడి కాపాడుతున్నారంటూ మండిప‌డ్డారు.  ప‌నిలో ప‌నిగా క‌డ‌ప స్టీల్ ప్లాంట్ పై వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎందుకు డిమాండ్ చేయ‌టం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. అస‌లు స్టీల్ ఫ్యాక్ట‌రీ క‌డ‌ప‌లో వ‌ద్దంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కేంద్రానికి లేఖ రాసింద‌ని బిజెపి అధ్యక్షుడు చూపిస్తున్న లేఖ గురించి మాత్రం జూపూడి మాట్లాడ‌లేదు. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ సినిమాలు కాద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌నాలే జ‌గ‌న్ కు నిజ‌మైన సినిమాలు చూపిస్తారంటూ జూపూడి హెచ్చ‌రించారు. బిజెపి అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఉద్దేశించి మాట్లాడుతూ,  క‌న్నా పేరుకు మాత్ర‌మే అధ్య‌క్షుడ‌ని, నిజానికి ఆయ‌న జ‌గ‌న్ ఏజెంట్ అంటూ మండిప‌డ్డారు. 

Image result for modi fitness challenge

మరింత సమాచారం తెలుసుకోండి: