ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని గద్దె నుంచి దించేస్తామంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ చాలెంజ్ చేశారు. కాపుల ఓట్లతో పీఠమెక్కిన బాబుకు  అదే కాపులు తమ తడఖా ఏంటో చూపిస్తారన్నారు. నాడు అధికారం కోసం కాపుల మద్దతు కోరుతూ ఇల్లిల్లూ తిరిగిన బాబు సీఎం కాగానే అన్నీ మరచిపోయారని ఎద్దేవా చేశారు. ఓట్లు వేసిన అదే కాపులను జైళ్లకు పంపిన దారుణమైన వ్యక్తి బాబు అంటూ ముద్రగడ ఆగ్రహించారు. 

తాపీగా మరచిపోయారు

Image result for ముద్రగడ

కాపులను బీసిలలో చేర్చే అంశాన్ని పక్కన పెట్టిన ఘనత చంద్రబాబుదేనని  ముద్రగడ సెటైర్లు వేశారు. కాపులను తాపీగా మరచిపోయి తన రాజకీయం తాను చూసుకున్న ఘనుడు బాబు అని ఓ రేంజి లో ముద్రగడ ఫైర్ అయ్యారు. బీజేపీతో బాగున్న రోజులలో కాపుల అంశాన్ని ఏ మాత్రం కదపకుండా పుణ్యకాలమంతా గడిపేసిన బాబు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొక్కుబడిగా కేంద్రానికి ఓ పనికిరాని విన్నపం చేసి వూరుకున్నారని విమర్శించారు. అప్పటికి బీజేపీతో పూర్తిగా చెడిపోయినందున బాబు తప్పంతా వారి మీదకు తోసేశారని, ఇన్ని తెలివి తేటలున్న్న అయనను మళ్ళీ కాపులు నమ్మరు కాక నమ్మరంటూ ముద్రగడ పంచ్ వేసారు.
త్వరలోనే రాజకీయ నిర్ణయం 
 
వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న దానిపై  త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటామని ముద్రగడ స్పష్టం చేశారు. ఈ సారి కాపులను బీసీలలో చేరుస్తామని తమకు నమ్మకమైన హామీ ఇచ్చిన పార్టీకే  మద్దతు ఉంటుందని పెర్కొన్నారు. శ్రీకాకుళం  టూర్ వచ్చిన ముద్రగడ వైసీపీ నాయకులతో భేటీ కావడంతో ఆయన రాజకీయ వ్యూహం ఏంటన్నది చూచాయగా తెలుస్తోంది. మరి జగన్ తో ముద్రగడ దోస్తీ కడతారా అన్నది హాట్ టాపిక్


మరింత సమాచారం తెలుసుకోండి: