రాజ‌ధాని రైతుల్లో ఆందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో భూములు తీసుకుని ఇప్ప‌టికి న‌నాలుగేళ్ళ‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు ఒక్క ఇటుక కూడా వేయ‌లేదు. శంకుస్దాప‌న‌ల పేరుతో ఏదో డ్రామాలాడుతూ నాలుగేళ్ళు గడిపేశారు. తాజాగా రైతుల‌కు ఇవ్వాల్సిన వాటా భూములకు కూడా మ‌ళ్ళీ ఎస‌రు పెడ‌తారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంతో రైతుల్లో ఆందోళ‌న పెరిగిపోతోంది. ఒక‌వేళ జ‌రుగుతున్న ప్ర‌చారం గ‌ను నొజ‌మైతే రాజ‌ధానికి ప‌చ్చ‌ని పంట పొలాల‌ను ఇచ్చిన పాపానికి త‌మ వాటాగాఆ వ‌స్తుంద‌నుకుంటున్న స్దలం కూడా ద‌క్కేట్లు క‌నబ‌డటం లేదు.  

 

రియాల్ట‌ర్ల‌తో స‌మావేశం


Image result for chandrababu meeting

ఇంత‌కీ విష‌యం  ఏమిటంటే చంద్రబాబునాయుడు ఆధ్య‌క్ష‌త‌న అమ‌రావ‌తి స‌చివాల‌యంలో రియాల్ట‌ర్ల స‌మావేశం జ‌రిగింది. దేశంలోనే ప్ర‌ముఖ కంపెనీలుగా పేరున్న రియాల్ట‌ర్లు హాజ‌ర‌య్యారు. అమ‌రావ‌తిలో రియాల్టర్లు వ‌ర‌ల్డ్ క్లాస్ బిల్డింగులు క‌ట్టి ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు చెప్ప‌టం అందుకు వారు అంగీక‌రించ‌టం పూర్త‌యిపోయింది.  వారు నిర్మించిన భ‌వ‌నాల‌కు ఐదేళ్ళ పాటు వివిధ ప‌న్నుల నుండి మిన‌హాయింపులు ఇస్తామంటూ చంద్ర‌బాబు వ‌రం కూడా ఇచ్చేశారు. అందుకు త్వ‌ర‌లో ఒప్పందాలు కూడా చేసుకుంటారని స‌మాచారం. ఇంత వ‌ర‌కూ ఐతే ఓకేనే. కానీ అదే స‌మావేశంలో ఓ రియాల్ట‌ర్ కీల‌క‌మై ప్ర‌తిపాద‌న తెచ్చార‌ట‌. ఇంత‌కీ అదేమిటంటే, రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతుల‌కు వారి వాట క్రింద కొంత భూమిని ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పిన హామీ. ఆ హామీని న‌మ్మే రైత‌లు భూములు స‌మ‌ర్పించుకున్నారు. ఎక‌రాల్లో భూములు పోయినా గ‌జాల్లో వ‌చ్చే స్ధ‌లానికి కోట్ల రూపాయ‌ల విలువ వ‌స్తుంద‌ని రైతులు ఆశించారు. అయితే, ఇపుడా స్ద‌లానికి కూడా ప్ర‌భుత్వం మ‌ళ్ళీ ఎస‌రు పెట్టేట్లుంది.

 

 కొత్త‌గా మైక్రో పూలింగ‌ట‌

Image result for amaravati lands micro pooling

ఎలాగంటే, త‌మ‌కు ప్ర‌భుత్వం కేటాయించ‌ద‌ల‌చుకున్న భూముల‌తో క‌లిపి రైతుల‌కు ఇవ్వ‌నున్న స్ధ‌లాన్ని కూడా క‌లిపి ఇస్తే తాము అద్భుతాలు చేస్తామంటూ స‌ద‌రు బిల్డ‌ర్ హామీ ఇచ్చార‌ట‌. ఆ నిర్మాణాల్లో ప్ర‌భుత్వ‌, బిల్డ‌ర్ తో పాటు రైతుల‌కు కూడా వాటా ఉంటుంద‌ట‌. బిల్డ‌ర్ ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు కూడా హ్యాపీ ఫీల‌య్యార‌ట‌. ఒక‌సారి కేటాయించిన స్ధలాల‌ను తిరిగి ప్ర‌భుత్వ‌మే తీసేసుకోవ‌టాన్ని మైక్రో పూలింగ్ అని అంటార‌ట‌. బిల్డ‌ర్ -ప్ర‌భుత్వం మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఒప్పందాలేంటో అందులో త‌మ పాత్రేంటో తెలీక రైతుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఒక‌వేళ తాము ఇచ్చేది లేద‌ని చెప్పినా రైతుల నుండి స్ద‌లాల‌ను ఎలా తీసుకోవాలో చంద్ర‌బాబుకు బాగా తెలుసు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: