అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలుగుదేశం అదినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఓటమి ఖాయమని అర్థమైనట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న వైఎస్ జగన్ ని చూసి తెలుగుదేశం నేతలు అలాగే చంద్రబాబు నాయుడు నోటికి ఇష్టం వచ్చినట్లు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Related image
అయితే ముందు నుంచి చంద్రబాబు ఇదే ప్రయత్నం చేయడంతో ప్రజలు కూడా చంద్రబాబు చేసేవి కేవలం ఆరోపణలు అబద్ధాలే అందులో వాస్తవం లేదు అన్ని బలంగా నమ్ముతున్నాను. ఇటువంటి పరిస్థితులలో వచ్చేఎన్నికలలో ఖచ్చితంగా ఓటమి ఖాయమని తెలుసుకున్న చంద్రబాబు...ఓటమికి సాకులు కూడా వెతుక్కుంటున్నాడు చంద్రబాబు.
Related image
ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం అనే మాట చంద్రబాబు నోట ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాలేదు. తెదేపా గెలుపు చారిత్రక అవసరం……తాను ముఖ్యమంత్రి అవ్వడం అంతకంటే ఎక్కువ అవసరం అని మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నాడు. అదే విధంగా నాయకులు ఎవ్వరూ బాగా పనిచేయడం లేదని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేస్తున్నాడు.
Related image
ఇక ఇప్పుడు తాజాగా బిజెపి ఈవిఎంలను మేనేజ్ చేస్తోంది అన్న ప్రకటన కూడా చేసేశాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చంద్రబాబు చేసే మొదటి ప్రకటన ఇదే ఉంటుందనడంలో సందేహం లేదు. మరోపక్క చంద్రబాబు భజన చేసే ఎల్లో మీడియా కూడా ఈ సాకు పై కథనాలు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: