దక్షిణభారత దేశం మినహా దాదాపు అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులే రాజ్యం ఏలుతున్నారు. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలోని ఇరవై ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు బీజేపీ వారే కావడం దేశంలో ఆ పార్టీకి గల పేరును తెలియజేస్తుంది. మోడీ, అమిత్ షా ల ద్వయం ఆంధ్రప్రదేశ్ లోకి కూడా పార్టీని విస్తరించడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని మెల్లగా రాష్ట్రంలో పాకిపోవాలనుకున్నారు. అయితే రాష్ట్రానికి హోదా ఇవ్వకపోవడంతో టీడీపీ పొత్తు తెంచేసుకొని బీజేపీ ని ఏకాకిని చేసింది. 


పొత్తు తెంచేసుకున్న టీడీపీ మాత్రం హోదా అంశాన్ని లేవనెత్తి మొత్తం అపనిందను బీజేపీ మీద వేసింది. దెబ్బకు హోదా ఇవ్వలేదన్నందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీపై వ్యతిరేఖం అయ్యారు. దీనితో వచ్చిన 3 సీట్లు కాస్తా ఓడిపోయే ప్రమాదంలో చిక్కుకుంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు అందించి ప్రజల మన్ననలను పొందాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఇది చేస్తే అయినా హోదా కోపాన్ని ఆంధ్రులు తగ్గించుకుంటారని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. 


ఈ బుజ్జగింపులకు కడప ఉక్కు కర్మాగారాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వెల్లడిచేసారు. కడప ఉక్కు కర్మాగారంపై కేంద్రం సుముఖంగా ఉందన్న ఆయన, రాష్ట్రప్రభుత్వం నివేదిక ఇస్తే త్వరలోనే పనులు మొదలు పెడతారని చెప్పుకొచ్చారు. అంతేగాక కడప ఉక్కు ఫ్యాక్టరీని అమిత్ షా పర్సనల్ గా తీసుకున్నాడని తెలిపాడు. వైసీపీ బీజేపీకి మద్దతిస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో ఇలాంటి దాంతో ప్రజల మెప్పు పొంది బాబుకు చెక్ పెట్టి జగన్ తో దోస్తీ చేపట్టి రాష్ట్రంలో పాతుకపోవడానికి ఇది మోడీ మాస్టర్ ప్లాన్ అని అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: