Related image
ఫోక్స్ వ్యాగన్‌ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు జర్మనీ ప్రభుత్వం తల బొప్పికట్టే జరిమానా విధించింది. జర్మనీ చరిత్రలోనే అతిపెద్ద భారీ జరిమానా గా ఇది చరిత్ర కెక్కింది. డీజిల్ కార్ల ఉద్గారాల విషయంలో మోసానికి పాల్పడిన ఫోక్స్‌ వ్యాగన్‌ పై ఏకంగా బిలియన్ యూరోల (రూ.7870 కోట్లు or $1.18 billion) జరిమానా విధిస్తూ జర్మనీ నిర్ణయం తీసుకుంది. వాహన పరీక్షల సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ విడుదల అవుతున్నట్లు చూపించేలా కారులో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ను (అనుమతి లేని సాఫ్ట్-వేర్)  ఉపయోగించినట్లు దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది.  
Image result for volkswagen cars in germany
జర్మనీ దేశ చరిత్రలోనే ఈ జరిమానా ఇది అత్యధికం. మరోవైపు, ఐరోపా వ్యాప్తంగా 7.74 లక్షల వాహనాలను కూడా వెనక్కి పిలిపించాలని సంస్థను జర్మనీ ప్రభుత్వం ఆదేశించింది. తప్పును అంగీకరించిన ఫోక్స్ వ్యాగన్ ప్రభుత్వం విధించిన జరిమానాను చెల్లించేందుకు సిద్ధమని పేర్కొంది.
Image result for volkswagen cars in germany
వాహనాల రీకాల్, జరిమానాను కలుపుకుంటే మొత్తం 25 బిలియన్ యూరోల (₹196750 కోట్లు) వరకు ఫోక్స్‌వ్యాగన్‌ పై భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. జర్మనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానాగా మ్యూనిక్ ప్రోసెక్యూటర్స్ (న్యాయవాదులు) తెలిపారు. 

Image result for volkswagen cars in germany

మరింత సమాచారం తెలుసుకోండి: