గత సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు భారతీయ జనతా పార్టీ తో కలిసి కొద్దిపాటి మెజారిటీతో అధికారంలోకి వచ్చి అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్ర రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా చేసిపారేశారు అని అనటంలో సందేహం లేదు. అంతేకాకుండా  విభజన సమయంలో ఆ నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో ప్రజలను తీవ్రంగా మోసం చేసి తన రాజకీయ మనుగడ సాగిస్తున్నారు చంద్రబాబు. గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని మీడియా సాక్షిగా బహిరంగంగా మాట్లాడిన చంద్రబాబు..తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని యువతకు ఉద్యోగాలు వస్తాయని గట్టిగా మాట్లాడటంతో..వెంటనే చంద్రబాబు యూటర్న్ తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి దొంగ నాటకాలాడుతోందని ఆ నెపాన్ని ఢిల్లీ  బిజెపి పెద్దలపై వేసేశారు.
Related image
ఇదే సమయంలో తన అనుకూల మీడియా ద్వారా కూడా బిజెపి పార్టీని అలాగే బిజెపి అధినాయకత్వాన్ని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా చిత్రీకరణ చేసే కథనాలు ప్రచురించారు. ఇదే సమయంలో గత ఆరు నెలలుగా చంద్రబాబు మోడీ పై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్ చేశారు. కామెంట్స్ చేసినా కూడా మోదీ నోరు విప్ప‌లేదు. కానీ ఏపి బిజెపినేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో బుధ‌వారం ఢిల్లీలో భేటీ అయిన సంద‌ర్భంగా ఓ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టారు.
Image result for chandrababu modi
అదే హోదాకు సంబంధించిన అంశం. హోదా ఇస్తే ప్ర‌భుత్వం ఏడాదికి రూ. 1000 కోట్లు కూడా రాబ‌ట్ట‌లేద‌ని అదే ప్యాక‌జీ ఇస్తే ఏడాదికి 3600 కోట్ల రూపాయ‌లు వ‌స్తాయ‌ని లెక్క‌లు చెప్పి. హోదాను డ‌బ్బు రూపంలో మార్చి బాబు హోదాకు మంగ‌ళం పాడి ఇప్పుడు యూట‌ర్న్ ఎందుకు తీసుకున్నార‌ని మోదీ క‌న్నాను ప్ర‌శ్నించారు.
Image result for chandrababu modi
దీనికి క‌న్నా సమాధానం చెబుతూ, ఎన్టీఆర్ ఎపిసోడ్ ద‌గ్గ‌ర నుంచి నేటి వ‌ర‌కు బాబు గారి నైజం.గురించి, బాబు ఎప్పుడు ఏం చేశాడు. ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతున్నాడు వంటి అంశాల‌తో పాటు. జ‌రిగిన ప‌రిణామాల‌ను క‌న్నా మోదీకి వివ‌రించార‌ట‌. ఈ విష‌యాల‌న్ని విన్న మోదీ ఓకింత ఆశ్య‌ర్య‌పోయాడంటున్నారు. దీంతో మరోపక్క ఆంధ్రరాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన హోదా మోసాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు క్షమించారు అంటూ పరిశీలకులు  వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: