తాను బీజేపీ నేతలతో సమావేశమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని వ్యక్తిగతపనుల మీద ఢిల్లీకి వెళ్లానని, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ-విప్‌ కూన రవికుమార్‌ ను ఏపీ భవన్‌లో కలిస్తే ఒక వర్గం మీడియా తనకు తోచిన విదంగా కథనాలు రాస్తోందని, వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి  రాతలు, అనైతిక రాజకీయా లతో కూడిన,  జర్నలిజం తెలుగు జాతి పరువు తీస్తుందంటూ మీడియాపై విరుచుకుపడ్డారు.



ఏపీ భవన్‌ లో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారని, ఉంటారని, టీడీపీ-విప్‌, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడితే, టీడీపీ విప్‌తో కలిసిన విజువల్స్‌ కట్‌ చేసి బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి ఉన్న వీడియో లు మాత్రమే ప్లే చేస్తూ మీడియా చూపిస్తోందని అన్నారు.
Image result for akula satyanarayana buggana rajendranath

టీడీపీ-విప్‌ కూడా నన్ను ఆలింగనం చేసుకున్నారని అయితే ఆయన వైసిపిలో చేరుతారా? అని ప్రశ్నించారు. దేశ రాజధాని లో రాష్ట్రానికి చెందిన అతిథి గృహంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలుసుకుని మట్లాడుకుంటే దాని చుట్టూ కట్టుకథ అల్లడం టీడీపీ ఎంతటి అభద్రతా భావానికి లోనవుందో చెప్పడానికి నిదర్శనమని అన్నారు. 




అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదు, ఆయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ ట్వీట్లు చూస్తే, తనకున్న “పప్పు బిరుదు” ను పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లే పనిలో దిగినట్టుందని విమర్శించారు. టీడీపీ  నాయకుల మానసికిస్థితి దివాళా తనం నుండి ఉన్మాదానికి చేరిందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడి, గందరగోళం, అయోమయంలో ఉన్నారని ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. 


ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను మంత్రులు, ఎమెల్యేలు, ఎంపిలు ఇతర తెలుగుదేశం ప్రతినిధులు నడపటం మానేసి వారికులానికే చెందిన ఒక ఇరవైకి పైగా ఉన్న విజన్ & ప్రింట్ మీడియాకు ఒప్పజెప్పి అధికారిక ప్రకటనలు విపరీతంగా వారికి ఇస్తూ వాళ్ళను సంతృప్తి పరుస్తున్నారన్న ప్రజల్లో ఉన్న ప్రచారం దీనితో నిజమేనా? అన్నట్లు తయారైంది. 

Image result for Telugu kamma media shilding TDP
ఆంధ్ర ప్రదెశ్ లోని ప్రభుత్వాన్ని సమర్ధించే తెలుగు మీడియా యాజమాన్యాలు ఒక కులం వారే అధికంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ మీడియా తెలుగు జాతికి చేసే చెఱుపు అంతా ఇంతా కాదంటారు. ఇసుమంత ప్రభుత్వవిజయాలను కొండంత చేసిచూపుతూ, కొండంత ప్రభుత్వ వ్యతిరేఖతను ఇసుమంతచేసి ప్రచారంలోకి రానివ్వకుండా మీడియా ప్రజా అభిప్రాయాన్ని నియంత్రిస్తూ ఇరవైకి పైబడా ఉన్నఈ కుల మీడియా వ్యవస్థ ఒక మాఫియా గా మారి రాష్ట్రాన్ని అధికార పార్టీ పిడికిట్లో ఉంచుతూ వస్తుంది. ఈ అవ్యవస్థకు పునాదులు 1974 ఆగష్ట్ లొనే పడ్డాయని – అప్పటి నుండి నాలుగు దశాబ్ధాలకు పైగా ఈ కుల మీడియా, మాఫియా వ్యవస్థ జాతిని ఒక రకమైన మైండ్-గేంతో ముందుకు నడుపుతుందని ప్రజలకు నిస్సంశయంగా రూఢీ ఐపోయింది.  
Image result for air asia scam
వీరంతా అనుదినం చంద్రబాబు నాయుడు కోసమే పని చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు శ్రేయస్సు కోరే వీరు తమ సంస్థలను నడుపుతూ ఉంటారు. దశాబ్దాలుగా తెలుగు మీడియాలో ఇది జరుగుతూ ఉంది. ఇలా మీడియాను మేనేజ్ చేస్తూనే చంద్రబాబు నాయుడు చాలా వరకూ తన రాజకీయాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో చంద్రబాబును రక్షించడానికి మీడియా వర్గాలు ఎంత వరకూ అయినా దిగజారగలవు అని మరోసారి నిరూపణ అవుతోంది. తాజా ఉదాహరణగా ‘ఎయిర్ ఏసియా కుంభ కోణం’ కవరేజీ చక్కటి ఉదాహరణ.



ఎయిర్ ఏసియా ప్రతినిధులు మాట్లాడుకొంటూ, అక్రమంగా లైసెన్సులు పొందడానికి చంద్రబాబునాయుడును ఆశ్రయించడ మే మేలని చెప్పుకున్నారు. చంద్రబాబుతో మంచిగా ఉంటే పనులన్నీ పూర్తి అవుతాయని వారు అనుకున్నారు.  ప్రత్యేకించి కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు ఉన్న సమయం లో ఈ సంభాషణలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలా చూస్తే ఇది చంద్రబాబు రాజయకీయ జీవితంపై మాయని మచ్చే. “బాబు తో నైస్ గా ఉంటే పనులు పనులు నైస్ గా అయిపోతాయి, అక్రమంగా లైసెన్సులు పొందవచ్చు” అని వారు మాట్లాడుకోవడం బాబుకు ఉన్న ఇమేజ్ ను పూర్తిగా డామేజ్  చేసిన సంచలన వార్త. అయితే తెలుగు మీడియాకు మాత్రం దీన్ని గురించి ఇందులో చంద్రబాబునాయుడు పాత్ర గురించి ఏమాత్రం ఎలవేట్ చేయకుండా కొంత 'సప్రెస్' చేసిందనే చెప్పాలి.  ఓటుకు నోటు కేసు కు ఇదొక బోనస్. చంద్రబాబు ప్రవర్తన తీరుతెన్నులు ఎలా ఉంటాయో ప్రపంచానికి బాగా పరిచయం చేసిన కేసది.
 


తెలుగు మీడియా అంటే అది తెలుగు దేశం మీడియా అయిపోయింది. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఈ మీడియా వర్గాలు పని చేస్తూ ఉన్నాయి.  చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసే వార్తలను ఇవి ప్రచురించవు. కనీసం జనాలకు వార్తల రూపంలో అంటే సమాచార రూపంలో కూడా తెలియజేయడానికి కూడా ఇష్టపడవు అని స్పష్టం అవుతోంది. అయితే సూర్యోదయాన్ని కోడి కూత నియంత్రించలేనట్లు  పచ్చ పత్రికలు, టీవీ చానళ్లు ఎంత ప్రయత్నించినా తెలిసేనిజాలు ప్రజలు తెలియకమానవు. ఇప్పుడు ఇప్పుడు సమాచార ప్రపంచం జనం గుప్పిట్లోకి వచ్చింది. 



నాలుగు దశాబ్ధాల కాలంలో, రెండు సార్లు ధారుణ పరాజయాన్ని చవిచూసిన నాయకుడి అపజయాన్ని,  చంద్రబాబు కోసం సర్వం త్యాగం చేసిన మీడియా ఇంత దన్నుగా ఉండి కూడా ఏ మాత్రం ఆపలేకపోయింది. అలాగే అత్యంత దురాగతమైన ‘ఓటుకు నోటు కేసు’ పై చాలా కాలం వార్తలను అణచివేసింది. టిడిపి-బిజెపి మైత్రి వెలుగులీలిన కాలంలో బిజెపిని, మోడీని ఆకాశానికెత్తిన ఈ మీడియా, చంద్రబాబు యు-టర్న్ తీసుకున్న మరుక్షణం బిజెపిని అణగ దొక్కేవార్తలు నిర్లజ్జగా రాస్తుంది.
Image result for air asia scam
చంద్రబాబు విచారణపై, 17 కేసులపై కోర్ట్ లో స్టే తెచ్చుకున్నా ఈ మీడియా ప్రశ్నించదు. అదే కాంగ్రెస్, బిజెపి, వైసిపి అయితే దుమ్ముదులిపేస్తుంది. మీడియాకు ఉండ వలసిన కనీస నియంత్రణ, మర్యాద సిగ్గు శరం వదిలెసి పూర్తి దిగంబరంగా తయారైంది, 'మీడియా మాఫియా' లాగా.  టిఆరెస్ పై ఒక నెగెటివ్ వార్త కూడా తెలంగాణాలో  రాయలేవీ దమ్మున్న పత్రికలు.



సమాచార వ్యవస్థ భారత రాజ్యాంగానికి నాలుగవ స్థంభం అనటానికి తెలుగు మీడియాకు అర్హతలేదు. కారణం ఒక కులానికి, ఒక నాయకునికి, ఒక ప్రాంతానికి పరిమితమై కునారిల్లే ఈ వ్యవస్థ గౌరవప్రదమైన ఆ అర్హత ఏనాడో కోల్పోయింది.  ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది కోట్లకు పైగా ఉన్న తెలుగు జనాభిప్రాయం. ఏదైనా ఒక వార్త గుఱించి మాట్లాడితే, ఏ పత్రికలో లేదా ఏ చానల్లో చూశావ్? అని తెలుసుకొన్న తరవాతే దాని క్రెడిబిలిటి గుర్తించటం ప్రపంచ వ్యాప్తంగా ఒక్క తెలుగువారికే స్వంతం. వార్తలో చదివే పత్రిక చూసే చానల్ బట్టి వారి కులమేదో సరిగ్గా నిర్ణయిచటం ఒక్క తెలుగుజాతికే స్వంతమైన సుగుణం.   

Image result for air asia scam

మరింత సమాచారం తెలుసుకోండి: