Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 3:27 pm IST

Menu &Sections

Search

అక్కడే.. గెలవలేకపోతే బీజేపీ ఇంకెక్కడ గెలవగలదు..!?

అక్కడే.. గెలవలేకపోతే బీజేపీ ఇంకెక్కడ గెలవగలదు..!?
అక్కడే.. గెలవలేకపోతే బీజేపీ ఇంకెక్కడ గెలవగలదు..!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బీజేపీకి బ్యాడ్ టైం బాదేస్తున్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో మరో ఉపఎన్నికల ఫలితం కూడా  పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. జయనగర సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పరం చేసింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో సానుభూతి సైతం భారతీయ జనతా పార్టీని ఆదుకోలేకపోయింది. ఉత్తరాదిలో వెక్కిరిస్తున్న వరుస వైఫల్యాలు దక్షిణాదిలోనూ బీజేపీని వెంటాడుతున్నాయి. కర్ణాటకలో మెజార్టీ ప్రజల మద్దతు మాకే ఉందని చెప్పుకుంటున్న బీజేపీకి రాజరాజేశ్వరీ నగర్, జయనగర్ ఉపఎన్నికలు గట్టి ఎదురుదెబ్బగా పరిణమించాయి. బెంగళూరు లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ బలం పుంజుకోగా.. బీజేపీ వెనకబడింది.

bjp-bjp-badtime-sympathy-no-votes-karnataka-up-utt

ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో 104 సీట్లు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించి, మూడు రోజుల పాటు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ.. జయనగర ఉపఎన్నికలో కూడా చతికిలపడింది. కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్య రెడ్డి.. తన సమీప భాజపా అభ్యర్థి ప్రహ్లాద్‌పై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 54,045ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 50,270 ఓట్లు దక్కాయి. మే 12న కర్ణాటక అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు జరగ్గా.. జయనగర నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బీఎన్‌ విజయకుమార్‌ ప్రచార సమయంలోనే మరణించారు. ఆయన అకాలమరణంతో జయనగర ఎన్నిక రద్దయ్యింది. జూన్‌ 11న పోలింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయకుమార్‌ సోదరుడు, బీఎన్‌ ప్రహ్లాద్‌ బరిలో నిలవగా.., కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీకి దిగారు. తమ కూటమి పార్టీ అయిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు జయనగర ఎన్నికల్లో జేడీఎస్‌ పోటీ నుంచి తప్పుకుంది.

bjp-bjp-badtime-sympathy-no-votes-karnataka-up-utt

నిజానికి జయనగర బీజేపీ కంచుకోట. అలాంటి సిట్టింగ్ సీటును సైతం కమలం విపక్షాల ఐక్యత ముందు నిలబెట్టుకోలేకపోయింది. జయనగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత విజయకుమార్ అకాల మరణంతో ఎన్నికలు వచ్చినప్పటికీ, ఇక్కడ సానుభూతి సైతం పనిచేయలేదు. స్వయంగా ఆయన సోదరుడు బరిలోకి దిగినా.. కూటమి ఐక్యత ముందు నిలబడలేకపోయారు. ప్రతిపక్షాలు ఏకమైతే.. బీజేపీని ఎలాంటి సానుభూతి ఆదుకోదన్న విషయం జయనగర ఉపఎన్నికతో రుజువైంది..

bjp-bjp-badtime-sympathy-no-votes-karnataka-up-utt

ఉత్తర ప్రదేశ్ లోని కైరానా లోక్ సభ ఉపఎన్నికలోనూ సానుభూతి ఓట్లుతో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూసిన బీజేపీకి విపక్షాల ఐక్యపోరాటం పరాభవాన్ని మిగిల్చింది. 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థి హుకుం సింగ్ 50.54 శాతం ఓట్లతో కైరానా లోక్ సభా స్థానంలో వరుసగా రెండోసారి బీజేపీ జెండా ఎగరేశారు. మోదీ హావాతో చరిత్ర సృష్టించారు. ఆయన ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. హుకుం సింగ్ కుమార్తె, మృగాంకా సింగ్ ను బీజేపీ బరిలోకి దించింది. గతంలో బీజేపీపై పోటీచేసి కేవలం 3.81 శాతం ఓట్లకే పరిమితమైన ఆరెల్డీ.., ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో 44 వేల మెజార్టీతో కైరానా సీటు గెచ్చుకుంది. పద్నాలుగేళ్ల తర్వాత తన సొంత స్థానాన్ని దక్కించుకుంది. విపక్షాల ఐక్యతను సానుభూతి ఓట్లతో నెగ్గుకు వచ్చేద్దాం అని చూసిన బీజేపీకి తొలి ఘోరపరాభవమే ఎదురైంది.

bjp-bjp-badtime-sympathy-no-votes-karnataka-up-utt

                సాధారణంగా భారతీయ ఓటర్లు సెంటిమెంట్ కు పట్టం కడతారు. సానుభూతి చూపిస్తారు. కానీ బీజేపీ అభ్యర్థులకు సానుభూమి ఏమాత్రం కలసిరావడం లేదు. సానుభూతి పవనాలను సైతం తమవైపుకు తిప్పుకోలేని బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వైఖరితో ప్రజల ముందుకెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది.


bjp-bjp-badtime-sympathy-no-votes-karnataka-up-utt
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.