రాజ‌కీయాల్లో త‌ల‌త‌న్నే వాడుంటే.. తాడిని త‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడ‌ని నానుడి! ఎవ‌రికి వారే తోపులు! ఈ విష‌యా న్ని మ‌రిచిపోయిన‌.. ఏపీ బీజేపీకి తాజాగా అధ్య‌క్షుడైన మాజీ కాంగ్రెస్ నాయ‌కుడు, మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారా య‌ణ.. ఇటీ వ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌ల‌వ‌డానికి ముందు మీడియా మీటింగ్ పెట్టి మ‌రీ .. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విరుచుకు ప‌డ్డారు. కేంద్రం నిధులు ఇస్తున్నా.. బాబు బొక్కేస్తున్నారు త‌ప్ప‌.. అభివృద్ధి చేయ‌డం లేద‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ‌.. ఎమ్మెల్సీ, ప్ర‌భుత్వం విప్ బుద్ధా వెంక‌న్న.. క‌న్నాపై మాట‌ల యుద్ధానికి దిగారు. అవినీతిప రులా మాట్లాడేది? అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర‌స్థాయిలో వైర‌ల్ అయ్యాయి. 

Image result for buddha venkanna

క‌న్నాను ఉద్దేశించి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఏ ఒక్క నేతా కూడా చేయ‌ని విధంగా బుద్ధా చేసిన వ్యాఖ్య‌లకు బీజేపీ నుంచి కౌంట‌ర్ ఇచ్చే వారే క‌రువ‌వ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. నిజానికి క‌న్నా రాజ‌కీయంగా చాలా సీనియ‌ర్‌. కానీ, ఎక్క‌డ ఎలాంటి మాట‌లు మాట్లాడాలి? అనే విచ‌క్ష‌ణ‌ను ఆయ‌న కోల్పోయారు. నిజానికి ప్ర‌ధాని మోడీవ‌ద్ద ఆయ‌న గుర్తింపు తెచ్చుకోవాలి.. అనుకుంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, చంద్ర‌బాబును తిట్ట‌డ‌మే ప‌ర‌మావ‌ధి.. అనుకోవ‌డ‌మే క‌న్నాకు ప్ర‌తికూల అంశంగా ప‌రిణ‌మించింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లకు అంత‌కు నాలిగింత‌ల వేడి పుట్టించేలా గ‌ట్టి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బుద్ధా.  

Image result for kanna laxmi narayana

మ‌రో ప‌ది మాసాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ  నుంచి పోటీ చేసినా తాను బ‌రిలోకి దిగుతాన‌ని,  చిత్తు చిత్తుగా ఓడిస్తాన‌ని అన్నారు. అంతేకాదు, క‌న్నాకు డిపాజిట్‌ వస్తే గుండు గీయించుకుంటానని బుద్దా చేసిన స‌వాల్‌.. ఎవ‌ర్ గ్రీన్‌గా నిలిచింది. బీజేపీ మోసాలను, వారికి సహకరిస్తున్న వైసీపీ, జనసేన నాయకులకు ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పదేళ్లపాటు అవినీతి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అందిన కాడికి దోచుకుని దాచుకున్న కన్నా న‌ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీ పంచన చేరారని విమర్శించారు. 


ఇక‌, బుద్దా ఇచ్చిన రివ‌ర్స్ కౌంట‌ర్‌తో క‌న్నాకు ఊపిరి ఆడ‌లేద‌నే వ్యాఖ్య‌లు బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల నుంచే వినిపించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బీజేపీలో క‌న్నా వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న కొంద‌రు సోము వీర్రాజు అనుచ‌రులు అయితే.. ఎమ్మెల్సీ బుద్ధా స‌రైనోడు! అంటూ మెసేజ్‌లు పంపుకోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా టీడీపీ నుంచి క‌న్నాకు స‌రైన మొగుడు దొరికాడంటూ.. పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. ఇక‌, ఈ పోరు ఎన్నిక‌ల వ‌ర‌కు సాగుతుంద‌న‌డంలో సందేహం లేదు!



మరింత సమాచారం తెలుసుకోండి: