నిరుద్యోగులకు వేయి రూపాయల భ్రుతి.. అదీ నాలుగేళ్ళ తరువాత అనేక షరతులతో.. ఇదేంది చంద్రబాబూ అంటూ తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. మనం ఎన్నికల మ్యానిఫేస్టో లో చెప్పిందేంటి, చేస్తోందేంటి అంటూ అటాక్ చేశారు. ఏపీలోని ప్రతి నిరుద్యోగికీ అధికారంలోకి వస్తే నెలకు రెండు వేల రూపాయల వంతున ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్ళుగా పైసా ఇవ్వలేదన్నారు. 
ఇదేం లెక్క !

Image result for chandrababu naidu

నిరుద్యోగికి వేయి రూపాయలు ఇవ్వడానికి కూడా సవాలక్ష నిబంధనలు విధించిన ప్రభుత్వం అసలు హామీని పక్కన పెట్టేసిందని గుస్సా అయ్యారు. మ్యానిఫేస్టోలో లేని వయో పరిమితి,  ఇపుడెందుకు వచ్చాయన్నారు. . ఏ లెక్క ప్రకారం ఏపీలో నిరుద్యోగులు పది లక్షల మంది మాత్రమే వున్నారని చెబుతున్నారని నిలదీశారు. ఎంతమని నిరుద్యోగులు వున్నరో కూడా ఈ సర్కార్ కి తెలుసా అంటూ మండిపడ్డారు. నిజానికి ఏపీవ్యాప్తంగా ఇరవై లక్షల  పై చిలుకు నిరుద్యోగులు వున్నారని క్రిష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం వారందరికీ నెలకు రెండు వేల రూపాయలు వంతున నిరుద్యోగ భ్రుతి ఇవ్వల్సిందేనని దిమాండ్ చేశారు.

Image result for tdp

బీసీలను పట్టించుకోవడంలేదు
పాలకులు బీసీలను అసలు పట్టించుకోవడం లేదని క్రిష్ణయ్య అగ్రహించారు. వారి ఓట్లతోనే గెలిచి వారికే పంగనామాలు పెడుతున్నారని, ఈ దందాలు ఇకపై సాగవంటూ అన్ని పార్టీలకూ వార్నింగులు ఇచ్చారు. అవసరైమైతే బీసీలే కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తారంటూ హెచ్చరించారు. మరి చూడాలి క్రిష్ణయ్య కోపం రాజకీయ పార్టీలను ఎల గింగిరాలు పెట్టనుందో.  తమ  పార్టీలో వున్నారో లేదో తెలియని క్రిష్ణయ్య ఇస్తున్న పంచ్ లు తమ్ముళ్ళకు ఎలా రియాక్ట్ కావాలో  కూడా అర్ధం కావడం లేదు


మరింత సమాచారం తెలుసుకోండి: