ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర  190వ రోజుకు చేరుకుంది.  తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం నుంచి ఆయన తన పాదయాత్రను కొనసాగించారు.  ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటుతున్నా..ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ది చేస్తున్నామని మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని..అక్రమార్కులకు పెద్ద పీట వేస్తూ..ప్రజలను దారుణంగా దోచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మరోసారి కల్లబొల్లి మాటలు చెబుతూ..ప్రజలను మభ్యపెట్టేందుకు తన పార్టీ శ్రేణులను రంగంలోకి దింపుతున్నారని..ఇకనైనా ప్రజలు మేల్కొని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు సూచిస్తున్నారు.  ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఆయన అడుగులో అడుగు వేస్తూ, ముందుకు కదిలారు.

పాదయాత్ర ఆత్రేయపురం నుంచి కతుంగ క్రాస్ రోడ్డు,లొల్ల, వాడపల్లి మీదుగా మిర్లపాలెం చేరకుంటుంది. అక్కడ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉబలంక మీదుగా రావులపాలెం వరకు యాత్ర కొనసాగుతుంది.  అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ గోడు విన్నవించుకునేందుకు  భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: