ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా టీడీపీ, వైసీపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  ఇరు పార్టీ నాయకులు వీలు చిక్కినప్పుడల్లా ఒకరినినొకరు దూషించుకుంటున్నారు.  తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం ఏపిలో టీడీపీ పరిస్థితి అయోమయంలో పడిందని..ప్రతి చిన్న విషయానికి భయాందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.  ఈ సందర్భంగా ఓ పిట్ట కథ చెప్పారు.
Image result for tdp
ఒక అడవిలో ఓ కుందేలు నిద్రిస్తున్న సమయంలో చెట్టు పై నుంచి ఓ కొబ్బరికాయ పడింది..దాంతో కుందేలుకి ఒక్కసారే భయపడి..ఆకాశం విరిగిపడుతోందని పరిగెత్తుతుంది.  దానికి ఎదురైన మరో జంతువుకి ఆకాశం విరిగి నెత్తిమీద పడబోతుందని వెంటనే పరుగెత్తు అపి భయపెడుతుంది.  ఇలా అడవిలో జంతువులన్నింటిని కుందేలు హడలెత్తిస్తుంది.  ఇప్పుడు ఏపిలో తెలుగు దేశం పరిస్థితి కూడా కుందేలు తీరే అయ్యిందని..ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎమ్మెల్యేలు కలిసి బీజేపీ ముఖ్య పెద్దలను కలిశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న నేఫథ్యంలో బుగ్గన  ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Image result for ysrcp
అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఎందుకంత భయపడుతోంది? అని ఆయన ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్‌గా తను కీలక పత్రాలను బీజేపీ పెద్దలకు అందజేశానని మంత్రి యనమల అన్నారని, తను ఇవ్వడానికి ఏముంది? అని బుగ్గన ప్రశ్నించారు. స్పీకర్ తెలుగుదేశం వ్యక్తే, పీఏసీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు తను ఏదో చేశానని భయమెందుకు? అని బుగ్గన అన్నారు. తెలుగు దేశం పార్టీ సభ్యులు ఇప్పటికైనా ఢిల్లీలో ఎవరెవరు కలిశారు? ఎక్కడ భోంచేశారు? వంటి వాటి గురించి చర్చించడానికి కన్నా వేరే వ్యవహారాలను చూసుకుంటే మంచిదని హితవు పలికారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: