విశాఖ వైసీపీ నేతలకు జగన్ పాదయాత్ర భయం పట్టుకుంది. పొరుగు జిల్లాలోకి జగన్ పాదయాత్ర మొదలైపోయింది. మరో ఇరవై రోజులలో విశాఖ జిల్లాలో అధినేత ప్రవేశిస్తారు. ఇక అక్కడ నుంచి ఆట మొదలవుతుంది. కనీసంగా ఇక్కడా ఇరవై రోజుల పాటు యాత్ర సాగే అవకాశాలు వున్నాయి. దాంతో అయ్యే  ఖర్చుని తలచుకుని  లీడర్లు జడిసిపోతున్నారు. మిగిలిన జిల్లాల మాదిరిగా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసే మహా నాయకులు విశాఖ వైసీపీలో లేరు. ఆర్ధికంగా బలవంతులైనా చేయి విదిలించే విషయంలో వెనకడుగు వేసే  వారే  ఎక్కువ. దాంతో ఎవరి నెత్తి మీద ఖర్చు రాసేద్దామా అని ఇప్పటి నుంచే నాయకులంతా ఎవరి రాజకీయాలు వారు మొదలెట్టేశారు. 

Image result for విశాఖ

ఆ ఎంపీ అభ్యర్ధి వైపు చూపు
ఈ మధ్యనే వైసీపీలో చేరిన విశాఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ ఎన్నికలలో పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు.  అయనకేమో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనుందట. పార్టీలో మాత్రం ఎంపీ క్యాండేట్ అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. ఎంపీగా పోటీ చేస్తే ఖర్చు పెను భారమవుతుందేమో అని ఆలోచిస్తున్న ఎంవీవీకి ఇపుడు పాదయాత్రం ఖర్చు కూడా తగులుకునేలా ఉందంటున్నారు. నిన్ననే రాజమండ్రి వెల్లి మరీ జగన్ తో అడుగులో అడుగు వేసిన ఎంవీవీకి అధినేత దిశా నిర్దేశం చేశారని టాక్ నడుస్తోంది. అది పాదయాత్ర కోసమేనంటున్నారు. 

Image result for విశాఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ

అన్నిటికీ అయనున్నాడుగా!
ఇక విశాఖ వైసీపీలో సభలు, సమావేశాలు పెట్టాలంటే ఏ నాయకుడూ ముందుకు రారు. ఎక్కడ ఆ ఖర్చు తమ ఖాతాలో పడుతుందోనన్న ఆందోళనతో అంతా తప్పుకు తిరుగుతారంట. అలా  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్ది మీదనే భారమంతా వేసేసి నేతలంతా హాపీగా ఉంటారు. రేపటి పాదయాత్ర వ్యవహారం కూడా విజయ సాయి చూసుకుంటారులే అన్న ధీమాతోనే  ఇపుడు అంతా వున్నట్లు టాక్. ఆయనకు తోడు ఎంవీవీ కూడా చేరాడని నేతలంతా బేఫికార్ అయిపోయారట. మరి ఇలాగే ఉంటే రేపటి ఎన్నికలలో టిక్కెట్లు కూడా విజయసాయి, ఎంవీవీ సిఫార్సు చేసిన వాళ్ళకే ఇచ్చి ఈ పీనాసి లీడర్లకు  జగన్ చెక్ పెడతారేమో అంటూ కౌంటర్లు పడిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: