ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు అనుభవం గడించిన తమ మెదడులకు పదును పెడుతున్నారు. సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం కూడా లేకపోవటంతో వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలో అన్న ఏకైక సిద్దాంతంతో ముందుకు సాగుతున్నారు. ఏపీలో కూడా  రాజకీయ వేడి మామూలుగా లేదు. జగన్, చంద్రబాబులు ఈ సారి ఎవరితో ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటారు  అన్న విషయం ఆసక్తికరంగా మారింది.


ఇప్పటి వరకు జరిగిన సంఘటనల దృష్ట్యా టీడీపీ, రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ తో జత కట్టడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత నెలలో జరిగిన కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయిన చంద్రబాబు, రాహుల్ గాంధీల చర్యలే ఇందుకు ఊతమిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి హోదా కల్పిస్తారనే వాదనతో బాబు వారితో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇక రాష్ట్రంలో ప్రముఖంగా వినిపిస్తున్న రెండో పొత్తు వైసీపీ, బీజేపీల పొత్తు. నిజానికి బీజేపీతో టీడీపీ విడిపోయినప్పటి నుండీ ఈ పార్టీల పొత్తు ప్రముఖంగా వినిపిస్తుంది. బాబుకు పీఎం అపాయింట్మెంట్ ఇవ్వకుండా వైసీపీ ఎంపీ విజయసాయికి ఇవ్వడం వంటి అంశాలు ఇందుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేగాక నిన్న ఢిల్లీలో వైసీపీ, బీజేపీ నేతలు హాజరవడం వీరి పొత్తు రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. మొత్తానికి ఒకరేమో రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో మమేకమవుతున్నారు ఇంకొకరు రాష్ట్రానికి రాష్ట్రానికి సహాయం చేసే అవకాశమున్నా కనీసం కనికరం అయినా చూపని పార్టీతో జతకట్టబోతున్నారు. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో!


మరింత సమాచారం తెలుసుకోండి: