ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహాలకు పదును పెడ్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంటు నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఈ సమీక్షలు ప్రారంభించారు. తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమీక్షలో చంద్రబాబు పలు కీలక అంశాలను చర్చించారు.

Image result for tdp review meeting

చిత్తూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. వాడివేడిగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మొహమాటంగా చర్చించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాక... రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రజల హక్కులు పరిరక్షించాలన్నా విభజనచట్టంలో అంశాలను, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను క్లీన్ స్వీప్ చెయ్యాలని చిత్తూరు జిల్లా నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Image result for chittoor district tdp

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త పనిచేయాలని చంద్రబాబు దిశేనిర్దేశం చేశారు. పార్టీలో అంతర్గత గొడవలు పక్కనపెట్టాలని స్పష్టం చేశారు. 1983, 1994 ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలో పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు నేతలు కృషి చేయాలని ఆదేశించారు. చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని వరుసగా ఆరుసార్లు గెలుచుకున్నామని.. కుప్పంలో అత్యధిక మెజారిటీ సాధించామన్నారు. జిల్లా అంతటా కూడా అదే జోరు కొనసాగించేలా నేతలు పని చేయాలన్నారు. వ్యక్తిగత దూషణలతో మనస్పర్థలు తెచ్చుకొని పార్టీ పరువు తియ్యొద్దని, సమష్టిగా పని చెయ్యాలని జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు.

Image result for chittoor district tdp

జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందని.. ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. హార్టీ కల్చర్ హబ్ గా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దుతున్నామని.. జిల్లా నేతలకు సీఎం తెలిపారు. జిల్లాలో పలు పరిశ్రమలను తీసుకువచ్చామని.. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులను సీఎం ఆదేశించారు. వైసీపీ ఎంపీల రాజీనామా వల్ల ఉపఎన్నికలు వస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు రావని తెలిసి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాజీనామాల అంశాన్ని వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారని సీఎం తెలిపారు. ఒప్పందంలో భాగంగానే రాజీనామాలను ఆమోదించ లేదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: