ఇదేంటి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ముప్పై  సంవత్సరాలు అవుతుంది కదా పొరపాటున తెలుగుదేశం అని రాయబోయి కాంగ్రెస్ పార్టీ అని తప్పుగా రాసారు అని అనుకుంటున్నారా? అదేమీ లేదు! మీరు సరిగ్గానే చదివారు. అవును నిజమే! ఏపీ పీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది అని వార్తలు వస్తున్న తరణంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.


ఎందుకంటే గత ఎన్నికలలో కూడా రాష్ట్రంలో పెద్దగా ప్రాభల్యంలేని బీజేపీ ని బాగానే వాడుకున్నాడు చంద్రబాబు. బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఒకవేళ తాను గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఏ చిన్న ఆటంకం రాకుండా బీజేపీకి వచ్చే రెండు, మూడు స్థానాలను కూడా రిజర్వు లో పెట్టుకున్నాడు. బీజేపీని తనకు నచ్చిన, కావలసిన విధంగా వాడుకొని వారితో  దోస్తీకి స్వస్తి పలికాడు.


ఇప్పుడు బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకొనబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర విభజన చేసి  నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ ను వాడుకుని కాంగ్రెస్ కి వచ్చే కొద్ది స్థానాలను జగన్ కు దక్కకుండా చేయాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా భావిస్తున్న రఘువీరా రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో తనకు అనుకూలమయిన, అంతకుమించి తమ కాపు సామాజిక వర్గ నేతను నియమించడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: