Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 10:04 pm IST

Menu &Sections

Search

2019ఎన్నికల వరకు చంద్రబాబు తీరు ఇంతే!

 2019ఎన్నికల వరకు చంద్రబాబు తీరు ఇంతే!
2019ఎన్నికల వరకు చంద్రబాబు తీరు ఇంతే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిననాటి నుండి, అంటె గతనాలుగేళ్లలో ఏమి సాధించారో గట్టిగా చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అసలు ఏమి చేసింది? పునఃశ్చరణ చేసుకోవటానికి కూడా మాత్రం ఏముందని అంటున్నారు విశ్లేషకులు. నామమాత్రపు పనులుచేయడం, పదులసంఖ్యలో విదేశ ప్రయాణాలు మందీ మార్బలం వెంటేసుకొని, ఒకే నిర్మాణానికి పదిసార్లు ప్రారంభోత్సవాలు, ప్రజలకు పలుమార్లు అంకితం చేయడం, సమయానికి తగు మాటలాడుతూ, కొన్నిసార్లు  అప్పటికప్పుడు సందర్భానికి తగ్గట్టుగా నోటికి వచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడేయటం, తాను నిప్పు అని  చెపుతూ వారు విపక్షం నేరగాళ్ళని చెపుతూ బురద జల్లడం, శాసనసభ నుండి విపక్షాన్ని మంద బలంతో బయటకు తోలేసి దాన్నే బహిరంగ సభ చేసి సోత్కర్షలు, పొగిడించు కోవటాలు, ‘చెప్పిందే చెప్పరా పాచిపళ్ళ దాసరి’ అన్నట్లు నిరంతరం తెలుగుదేశం పార్టీ పని ప్రస్తుతం ఇదే అవుతోంది.

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien

ప్రజాధనంతో స్వంత పత్రికలు చానళ్ళలో నిరంతర ప్రచారాలు, చంద్రబాబు నాయుడి స్వయం పొగడ్తలు, ఆత్మ స్తుతి పరనిందలు, అయినదానికి లేని దానికి విదేశీ ప్రయాణాలు, ప్రజల పండుగలు ప్రభుత్వం నిర్వహిస్తూ, నిర్విరామ ధారుణ ధన దుబారా చేయటం, ప్రశ్నించిన వారిని పోలీసుల పాల్జేసి ఒక రకమైన అపక్రటిత నియంతృత్వం నడిపిస్తున్నారు. ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం అయి పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండా ఒక్కటే అదే భారతీయ జనతాపార్టీపై వీలైనంత వ్యతిరేకతను ప్రజల్లో పెంపొదించడం.

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien

బీజేపీపై ఎంత వ్యతిరేకత పెంచినా తెలుగుదేశం పార్టీకి ఇసుమంతైనా లాభం లేదు. కారణం బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి స్థానం లేదు. అయినా తాను రాష్ట్రానికి ఏ న్యాయం చేయకుండా పూర్తిగా వృధా చేసిన నాలుగేళ్ళ కాలానికి చంద్రబాబు నాయుడు ప్రజలకు లెక్కజెప్పాలి అదీ 2019ఎన్నికలకు పోయేముందు. చేసిందేమైనా ఉంటే చెప్పటానికి కొంతైనా ఉంటుంది. అందుకే ఏమీ లేక బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకే అజెండాతో దాన్నే గోబెల్ ప్రచారంగా మార్చి ఒకటికి వెయ్యిసార్లు ప్రజల్లో ఘోషగా మార్చి చెపుతున్నారు. ఈ ద్వని పచ్చ మీడియా తన వేల నోళ్ళతో లక్షలసార్లు ప్రతిద్వనింపజేస్తుంది.

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien

సమయానికి వైసిపి-బీజేపీ అక్రమ సంబంధం ఉందంటూ పలుమార్లు చెపుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రాజకీయం చేస్తోంది. వైసీపీ నేతలు బీజేపీ నేతలతో సమావేశం అయ్యారని అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వరకూ ఇలాగే వ్యవహరించాలనేది చంద్రబాబు అభిమతం. ఈ స్లోగన్ తో 2019 ఎన్నికల్లో గెలిచి బయటపడాలనేది తెలుగుదేశం పార్టీ భావన. కాని పదే పదే వింటున్న వాళ్లకు "తినగ తినగ వేము తియ్యనగును" అన్న సామెతలాగా - అయితే ఏమిటి వైసిపి-బిజెపి స్నేహం ఒకే. టిడిపి-బిజెపి స్నేహం గతనాళుగేళ్లు నడవలేదా? వాటీజ్ దేర్? అనేలా తనే ప్రజలకు ఇంతేగదా! అన్నస్థాయికి తెచ్చేశారు. 


ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని మొన్నటి వరకూ ప్రచారం చేశారు. అయితే ప్రత్యేక హోదా వద్దన్నది తామే నని తెలుగు దేశం నేతలు దాచేస్తూ వచ్చారు. మీడియా ఆ విషయం మరుగున పడేసింది. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడాన్ని ప్రజలంతా మరిచిపోయారనేది తెలుగుదేశం పార్టీ ఫీలింగ్. కాని ప్రజల్లో ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని కాదు - ప్రత్యేక పాకేజీయే సర్వస్వం అన్న దృశ్యాలు, ధ్వనులు కళ్ళలో కనిపిస్తూనే ఉన్నాయి, చెవుల్లోమార్మోగుతున్నాయి.

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien

ఇక ఇప్పుడు కడపలో ఉక్కుపరిశ్రమ స్థాపన వ్యవహారం కూడా ఇలానే ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పరచటానికి సాధ్యపడే అవకాశాలు లేవని ఫీజబిలిటీ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మూడున్నరేళ్ళు అయిపోయిందట. అయితే నాడు “కూరిమికల దినములు కదా!” అందుకే చంద్రబాబు నాయుడు స్పందించలేదు.


కూరిమి గల దినములలో -

నేఱము లెన్నడును కలుగ నేరవు మఱి యా

కూరిమి విరసంబైనను -

నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!  

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien

కేంద్రంలో కలిసి ఉన్నప్పుడు, బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ అంశం గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు మాత్రం అన్యాయం జరుగుతోందని అంటున్నాడు. అయితే ప్రతిసారీ, ప్రతిదాంట్లోనూ ద్వంద్వ రీతిన వ్యవహరించడమే తన బలం అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా ఉన్నాడు. అయితే ఈ తీరే ఆయనను ముంచేసే అవకాశం ఉంది.

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien 

ap-news-ap-cm-chandrababu-during-the-days-of-frien
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
About the author