ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల కు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఈ రెండు జిల్లాలు ఏ పార్టీ వైపు మగ్గు చూపితే ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుంది. 2014 ఎన్నికల్లో కూడా రెండు జిల్లాలు టీడీపీ కి ఓట్లు వేసినాయి. దానితో టీడీపీ పార్టీ అధికారం లోకి వచ్చి చంద్ర బాబు సీఎం అయిపోయినాడు. అయితే ఇప్పడు జగన్ పాదయాత్ర కు రెండు జిల్లాల్లో అపూర్వ స్పందన వస్తుంది. 

Image result for jagan

అయితే ఇప్పడూ టీడీపీ మీద పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. చంద్రబాబు చెప్పిన రుణమాఫీ రైతులను, డ్వాక్రా రుణాల మాపీ మహిళలను ఆకర్షించాయి. అయితే ఇప్పుడు అది గతంగా మారింది.రైతులను, మహిళలను టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని జనం భావిస్తున్నారు. అంతేకాక కాపుల రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ సంగతి ఎలా ఉన్నా,కాపు సామాజికవర్గాన్ని ఘోరంగా అవమానించారని ఆ వర్గం బాధపడుతోంది.

Image result for jagan

కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబాన్ని, ఆ కుటుంబంలోని మహిళలను కూడా వదలకుండా పోలీసులు దూషించిన తీరు. అవమానించిన వైనాన్ని కాపు సామాజికవర్గమే కాకుండా, ప్రజాస్వామ్య ప్రియులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ ఇలాంటి వాటిని సహించరన్న అభిప్రాయం ఏర్పడింది. దానికి తోడు వెనుకబడిన తరగతులను అవమానించే విదంగా ఇద్దరు బిసి ప్రముఖులకు జడ్జి పదవులు రాకుండా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన విషయం బయటకు వచ్చాక బిసిలు మండిపడుతున్నారు.దానికి తోడు పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు, దందాలకు ,ఇసుక మాఫియాకు తెగపడుతున్న దారుణాలు ప్రజలకు విరక్తి పుట్టించాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: