రాజకీయాలనగానే సిగ్గు నియమం నిజాయతీ నైతికత నీతి మానం వదిలెయ్యాల్సిన పనిలేదు. చేసిన ప్రతి వెదవ పనికి చాణక్యం అని పేరుపెట్టరాదు. చాణక్యం నిజంగా దేశానికి, ప్రజలకు వారి ప్రయోజనాల సాధన లక్ష్యంగా ఉండే పాలనా నీతి, అయితే ఇందులో సుదూరంలో కూడా స్వప్రయోజనం కనిపించకూడదు. అలాంటి చాణక్యం పేరుతో చెసే తప్పుడు పనులు ప్రజల్లో రాజకీయ నాయకులపట్ల అసహ్యం పెంచుతాయి.
 


ఎంత రాజకీయాలైతే మాత్రం ఒకరీతి ఒకనీతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సరికాదుగా? ప్రజలేమీ పిచ్చోళ్లు కాదు గా?  ప్రజలు గ్యారెంటీగా అన్నీ గమనిస్తూనే ఉంటారు. "ఏమనుకుంటే ఏం అన్నట్లు"గా బరితెగించినట్లుగా రాజకీయులు  మాట్లాడటం ఏమాత్రం సరికాదు. కానీ ప్రస్తుతం "ఫస్ట్రేషన్లో" ఉన్న తెలుగు తమ్ముళ్లు తామేం మాట్లాడుతున్నామో తెలీనట్లుగా, మాట్లాడేటప్పుడు దేహంపై స్పృహ కోల్పోయి పరిసరాలను సహితం మరచిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడే స్తున్నారు.


విభజన ప్రయోజనాలు నేఱవేర్చకుండా నరెంద్ర మోడీ-అమిత్ షా ద్వయం ఆంధ్రప్రదేశ్ కు చేసిన తీరని ద్రోహం కంటే వారితో నాలుగేళ్ళు అంటకాగి ఒక్కసారి కూడా వారిని ప్రశ్నించకుండా తిరిగి వారు మన రాష్ట్రానికి ఏ ఇతర రాష్ట్రానికి చేయనంత మేలు చేసినట్లు చెప్పి — ఆ నోళ్ళే నుండే నేడు కారుకూతలు  విని పించటం న్యాయమా? ప్రస్తుతం మోడీ-షా లను పక్కనబెట్టి మననాయకుని నీతిని ప్రశ్నిద్ధాం! "మన బంగారం మంచిదైతే స్వర్ణకారుడేమి చేయగలడన్న సూక్తి" ఉండనే ఉంది. 


నాడు ప్రత్యేక హోదా వద్దని, అది సంజీవని కాదని శాసనసభ సాక్షిగా బల్లగుద్ది వాదించి మమ్మల్నందర్ని అంగీకరిం జేసిన ఒక పెద్దమనిషి ఒక్కసారి బిజెపి తో తేడా రాగానే నాలుక మడతేసి యూ-టర్న్ తీసుకోగానే - సమ్మతితో స్థిమితపడ్ద ప్రజాహృదయాలు మళ్ళా తిరగబడటం సాధ్యమా! ఇక్కడ కావలసింది నైతికత-నీతి చాణక్యం కాదు.  
Image result for CM Ramesh Comments on Pawan kalyan 
ఏపీకి మోడీ-షాలు మోసం చేసిన మాట ఎంత వాస్తవమో, ఆ మోసానికి అంతో ఇంతో సాయం చేసిన నాటి పాపం,  చంద్రబాబు బృందగానానికి ఉందన్న విషయాన్ని మర్చి పోకూడదు. మిత్రులుగా ఉన్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొచ్చే తెలుగు తమ్ముళ్లు, తమతో బంధం తెంచుకున్న వారి విషయంలో పెట్రేగిపోయి మాట్లాడే తీరు నిరంతరం అభ్యంతరమే.  


2014ఎన్నికల సమయాన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో దోస్తీకి  చంద్రబాబు పడిన ఆరాటం వర్ణనాతీతం. పవన్ కల్యాణ్  మిత్రత్వంపై తన సన్నిహితులదగ్గర చంద్ర బాబు చెప్పిన మాటల్ని ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు ‘ఫ్రెండ్-షిప్ ఫట్ ‘ మనగానే నాలుక మడతేసి మాట్లాడే తీరు ముఖ్యమంత్రి బృందానికి వారి చిత్తానికి తగినట్లుగా లేవు? పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబుకు "ప్రాణం" అయిన సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు గుర్తుచేసుకుని మరీ మండి పడుతున్నారు. 


సిద్ధాంతపరంగా, వివాదంపరంగా  విభేధాలుందవచ్చు - పవన్ ఏదైనా తప్పుచేస్తే నిలదీయటం ఏమాత్రం తప్పు కాదు. కానీ సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తెచ్చి అనవసర రాగ్ధాంతం చేయటం వెనుక చంద్రవ్యూహం బాహాటంగా కనిపిస్తూనే ఉంది. అటు బిజెపి తో ఇటు పవన్ తో స్నేహంలో తేడా రాగానే వ్యక్తిగతంగా వారిని వేటా డటం ఎంత న్యాయం?
Image result for CM Ramesh Comments on Pawan kalyan
ఒక గ్రామ సర్పంచ్ నుండి ఎమెల్యే ఎంపి వరకు తీరిదే. దీన్ని రాజకీయం అంటారా? గూండాయిజం అంటారా? ఒక్కో టిడిపి ప్రజా ప్రతినిధిని బై-నేం పరిశీలించండి - ప్రతి ఒక్కడి తీరూ మూసలో పోసిన కరుడు గట్టిన కౄరత్వం మాటల్లో చేతల్లో ప్రస్పుటంగా కనిపిస్తుంది 


ఉదాహరణకు రమణ దీక్షితుల వ్యవహారం తీసుకుంటే ఆయనపై టిడిపి అధికార ప్రతినిధి ఎమెల్సి సోమిరెడ్ది చంద్రశేఖరరెడ్ది మాట్లాడిన తీరు ఆమోదనీయమా? ఒకనాడు చంద్రబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రైతే అనుభవం తోడై రాష్ట్ర వికాసాన్ని ఆస్వాదిద్ధాం అనుకున్న మనందరికి మిగిలిందేమిటి బూడిద! ఇలాంటి సంస్కార హీనులకంటే ఇతరులే నయం అన్న భావన ప్రజల్లో శరవేగంగా విస్తరిస్తుంది.   
Image result for CM Ramesh Comments on Pawan kalyan
తమకు ప్రత్యర్థిగా మారిన పవన్ ను ఉద్దేశించి సీఎం రమేష్ తాజాగా మాట్లాడుతూ,  జీలకర్రలో కర్ర లేనట్లుగా పిచ్చి ప్రేలాపనలు పవన్ కళ్యాణ్  ప్రేలుతున్నారని  అంటూ, ఆయన పేరులో కళ్యాణ్ ఉన్నట్లే, ఆయన నిత్య పెళ్లి కొడుకని ఎద్దేవా చేస్తూ బదనాం చేశారు. మరింత ఎటకారం చేసే పెద్ద మనిషి 2014లో తమ అధినేత చంద్రబాబు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన నిత్య పెళ్లి కొడుకు అని తెలియదా అప్పుడు ఈ ప్రేలాపనలు ఎక్కడికి పోయాయి?


చట్టబద్ధంగా ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు. చట్టవిరుద్ధమైన పని ఏదో?  చేసినట్లుగా పెళ్లిళ్ల మీద కామెంట్లు చేస్తున్న సీఎం రమేష్ లాంటి వారి వ్యాఖ్యల్ని చంద్రబాబు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. లేని పక్షంలో పవన్ కల్యాణ్ కంటే కూడా టిడిపికి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందన్నది గ్రహించాలి.  ఈ విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తు న్నారు.  

 Image result for chandrababu modi pavan in 2014

అయినా న్యాయం గురించి మాట్లాట్టం మనకు తగునా - పర పార్టీ టిక్కెట్ పై గెలిచిన వాణ్ని మభ్యపెట్టి, మాయచేసి, ప్రలోభాలకు చివరకు నయాన్నో భయాన్నో లొంగదీసుకొని నీ పార్టీలో చేర్చుకున్న రోజే నీ పార్టీ బ్రతుకు సీతను చెఱబట్టిన రావణుడు తో సమానం. ఇంకా నీవెన్ని నీతులు మాట్లాడినా ధర్మ నిర్మాణ దీక్షలు చేసినా లభించేది బూడిదలో పోసిన పన్నీరే. అంత్యకాలం దాపురించిన కాలంలోనైనా సరిగా ప్రవర్తించటం మంచిదని చెపుతున్నారు విఙ్జులు. 
Image result for chandrababu modi pavan in 2018
మీరు దేశంలోని ప్రతిపక్ష పార్టీల ఐఖ్యత గుఱించి చక్రం తిప్పటం ప్రక్కనబెట్టి రాష్ట్రం గుఱించి అభివృద్ది గురించి పట్టించుకోకపోతే మిగిలేది "చివరకు మిగిలేది" మాత్రమే! నని ప్రజలు ఘంటాపథంగా చెపుతున్నారు. ఇది సిఎం రమెష్ కు కూడా వర్తిస్తుందట. మొత్తం నేడు తెలుగుదేశం నాయకులు ప్రదర్శిస్తున్న తీరు ఏ మాత్రం సరికాదన్న మాట పెద్దలు శ్రేయోభిలాషులు పలువురి నోట వినిపిస్తోంది. 

Image result for CM Ramesh Comments on Pawan kalyan

మరింత సమాచారం తెలుసుకోండి: