ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా..ఇప్పటికీ ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉంది.  అభివృద్ది పేరు తో ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తున్న టీడీపీకి బుద్ది చెప్పాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే..కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై  వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి స్పందించారు.   తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ఏ స్థాయిలో డ్రామాలాడుతున్నారంటే.. కడప జిల్లాపై చంద్రబాబు నాయుడికి, ఏపీ సర్కారుకి విపరీతమైన ప్రేమ అట. 'కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ రావట్లేదా? రావడం లేదని బీజేపీ వారు అన్నారా? ఇవ్వడం లేదని అన్నారా? పోరాడదాం, నిరాహార దీక్ష చేస్తాం' అని చంద్రబాబు అంటున్నారు.  నిజంగా వారు చేస్తోన్న ప్రకటనలు చూస్తోంటే గమ్మత్తనిపిస్తోంది.

నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు టీడీపీ నేతలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు.  ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చిందని, బీజేపీ బ్రహ్మాండంగా చేస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరిగినా కేంద్ర సర్కారుదే తప్పని అంటున్నారు. తాను చేసేదంతా చేశానని, ఇక కేంద్ర సర్కారుదే తప్పని అంటున్నారు.

కాపులకి రిజర్వేషన్ల అంశంపై కూడా మభ్యపెడుతున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని..వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా బుద్ది చెప్పి తీరుతారని..ఇప్పటికైనా తమ పద్దతి మార్చుకోవాలని జగన్ మోహన్ హితవు పలికారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: