కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహారం మామూలుగా ఏం లేదు. ఇప్పటికే కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి మమ అనిపించేసిన ఆ చేత్తోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూడా మంగళం పాడేయాలనుకుంటోంది. అయిదున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ కర్మాగారాన్న్ని మరింతా పరిపుష్టం చేయాల్సిన కేంద్రం కోరి మరీ నష్టాలలోకి నెడుతోంది. ఆ నష్టాలను సాకుగా చూపిస్తూ ప్రైవేట్ పరం చేయాలని కూడా ప్లాన్ వేస్తోంది. ఈ పరిణామాలతో ఉక్కు నగరంగా పేరు గాంచిన విశాఖ తల్లడిల్లుతోంది.

వాటాల విక్రయానికి రంగం సిద్ధం ?

Image result for vizag steel plant

విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి పది శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించడం పట్ల ఉక్కు కార్మికులు అందోళన చెందుతున్నారు. చక్కగా నడిచే ఈ పరిశ్రమను ఎందుకు నీరు కారుస్తున్నారని నిగ్గదీస్తున్నారు. విశాఖ స్టీల్ లాభాలు గడిస్తోందన్న‌ వార్షిక నివేదికలను చూపిస్తున్నారు.  అయినా నష్టాలంటూ ప్లాంట్ ని ప్రైవేట్ బాట పట్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దాదాపు ముప్పయి వేల పై చిలుకు కార్మికులు ఉక్కు పరిశ్రమను నమ్ముకుని ఉపాధి పొందుతున్న విష‌యం తెలిసిందే. 

ఇదీ అసలు సంగతి
దేశంలో ఏ ప్లాంట్ కి లేని విధంగా విశాఖ ప్లాంట్ కు సొంత గనులు లేకుండా చేసిన ఘనత కేంద్ర పాలకులదే. 1971లో ఇందిరా గాంధి చేతుల మీదుగా శంఖుస్థాపన చేసుకుని విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అన్న ఉద్యమంతో  1981లో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ గత నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని విజయాలను సాధించింది. అయితే సొంత గనులు లేకపోవడం వల్ల  ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతోంది. దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లకు కూడా సొంత గనులు వున్నాయి. ఒక్క స్టీల్ ప్లాంట్ కు మాత్రం కొనుగోలు చేయాల్సిన దుస్థితి. దీని వల్ల టన్ను ముడిసరుకు ని నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఉక్కు కర్మాగారం కొంటోంది. అదే సొంత గనులు వుంటే కేవలం వేయి రూపాయలకేటన్ను ముడిసరుకు లభ్యం అయ్యేది. దీని ఫలితంగా నిర్వహణ నష్టాలు కనిపిస్తున్నాయి. 

పోరాటమేదీ ?

Image result for vizag steel plant

తమ తప్పును కప్పి పుచ్చుకుని  ప్లాంట్ నష్టాలలో ఉందని కుంటి సాకులు చెబుతూ ఏకంగా పది శాతం వాటాలను అమ్మేయాలనుకోవడంపై ఉక్కు కార్మికులు భగ్గుమంటున్నారు. దీనిపై వామపక్షాలు పోరాట బాట పట్టాయి. కానీ మిగిలిన  ప్రధాన పార్టీలు మాత్రం ఏం మాట్లాడ‌టం లేదు. కడప ఉక్కు ఫ్యాక్ట‌రీతో పాటే విశాఖ ఉక్కు కోసం కూడ ఉద్యమిస్తే కేంద్రం దిగి వస్తుంటున్నారు.  తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యం త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని స్ధానిక బిజెపి నేత‌లు ఎంత మొత్తుకుంటున్నా ఫ‌లితం కన‌బ‌టం లేదు. మరి చూడాలి, విశాఖ ఉక్కు పోరాటం ఎలా సాగుతొందో.


మరింత సమాచారం తెలుసుకోండి: