విజయనగరం జిల్లా వైసీపీలో చిత్రమైన రాజకీయం రాజ్యమేలుతోంది. అక్కడ నాయకులుంటారు. కానీ వారంతా కుటుంబ సభ్యులే. వారి తరమే పాలిట్రిక్స్ చేస్తుంది. ఓట్లు జనం వేయాలి, పాట్లు కార్యకర్తలు పడాలి, సీట్లు మాత్రం ఆయా కుటుంబాలకే దక్కాలి. ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీలో అతి పెద్ద రాజకీయ కుటుంబం బొత్స సత్యనారాయణది. ఆయన, ఆయన భర్య బొత్స ఝన్సీ, ఆయన తమ్ముడు బొత్స అప్పల నరసయ్య, మరో తమ్ముడు వరసైన బండికొండ  అప్పలనాయుడు, మేనల్లుడు చిన్న శ్రీను ఇదీ బొత్స రాజకీయ సామ్రాజ్యం. పార్టీ ఏదైన రాజకీయం మాత్రం వారి ఇంటి గుమ్మంలోనే వుంటుంది. బొత్సా కుంటుంబం కాంగ్రెస్ లో ఉన్న‌పుడు కూడా ఇదే వ‌ర‌స‌. 

కాంగ్రెస్ లో మూడు పదవులు
 Image result for బొత్స సత్యనారయణ
కాంగ్రెస్ లో బొత్స సత్యనారయణ హవా ఓ రేంజిలో సాగింది. తాను మంత్రిగా, భార్య జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ గా, త‌ర్వాత ఎంపిగా తమ్ముడు ఎమ్మెల్యేగా పవర్ ఎంజాయ్ చేశారు.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత  కాంగ్రెస్  పార్టీ  తుడిచిపెట్టుకుని పోవ‌టంతో వైసీపీలోకి దూకేసిన ఆయన తన పరివారన్ని మొత్తం వెంట తెచ్చారు. ఈసారి మరో ఇద్దరికీ కూడా టిక్కెట్లు కావాలని కోరుతున్నారు బొత్స. వరుసకు సోదరుడైన బండికొండ అప్పలనాయుడు తో పాతు తన మేనల్లుడు చిన్న శ్రీనుకు పదవులు కావాలట. బొత్స విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే అయన భార్య విజయనగరం ఎంపీ క్యాండేట్. తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి, వరుసకు తమ్ముడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి రంగంలో  దిగుతార‌ట‌. చిన్న స్రీనుని శ్రీకాకులం జిల్లా ఎచ్చెర్ల నుంచి బరిలో దింపుతారట. అంటే జగన్ బొత్స తరఫున నాలుగు అసెంబ్లీ, ఒక ఎంపీ టికెట్ ఇవ్వలన్న మాట.

అదే రూట్లో కోలగట్ల
ఈయ‌నా అచ్చంగా బొత్సకు శిష్యుడే మరి. గురువు ఇంట్లొ అయిదుగురు వుంటే తక్కువలో తక్కువ తన ఇంట్లో నాలుగైనా వుండొద్దా అని వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి తెగ బాధ పడుతున్నారు. అందుకే తన తమ్ముడు తమ్మన్నశెట్టిని, భార్య అరుణను, అల్లుడు కౌశిక్ ని కూడా రంగంలో దింపేశారు. కోలగట్లకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది కాకుండా మరో ముగ్గురికి రేపటి ఎన్నికలలో జగన్ టిక్కెట్లు ఇవ్వలన్నమాట.

ఆ లేడర్ దీ అదే మాట 
ఇదే విజయనగరంలో వున్న మరో నాయకుడు శత్రుచర్ల చంద్రశేఖర్ పుత్ర రత్నం అయిన పరీక్షిత్ రాజు. అయన భార్య శ్రీ వాణి ఆల్రేడీ కురుపాం ఎమ్మెల్యేగా వున్నారు. అమెకు మరో మారు టిక్కెట్ రావడం ఖాయం. ఇంక పరిక్షిత్ రాజు కు అరకు పార్లమెంట్ టిక్కెట్ కావలి. ఈయన గారి తండ్రి చంద్రశేఖర రాజు మాజీ ఎమ్మెల్యే. అయన తనకు ఏ ప్రాధాన్యం లేదని అలిగి టీడీపీ కండువా కప్పుకున్నారు. అయనకూ టిక్కెట్ ఇస్తే ఆ ఫామిలీ ఫుల్ హాపీ. 

జెండా పట్టినోడే అమాయకుడు

Image result for ysrcp

అంతా బాగానే వుంది కానీ పార్టీ కోసం పనిచేసే అసలైన నాయకులకే ఇక్కట్లు తప్ప టిక్కెట్లు లేవు.  ఇలా  ఫ్యామిలీ ప్యాకేజ్ తో వైసీపీని  క‌బ్జా చేసేస్తే క్షేత్ర‌స్ధాయిలో ప‌నిచేసే వారికి పదవులెక్కడివని కేడర్ కస్సుమంటోంది. అధినేత జగన్ అందరికీ న్యాయం చేయాలని, అంతే  తప్ప ఇలా  రెండు మూడు కుటుంబాల‌కే పార్టీని అప్పగించేస్తే చూస్తూ వూరుకోమని హెచ్చరిస్తున్నారు. జగన్ పాదయాత్ర లో మరిన్ని సిత్రాలు వెలుగు చూస్తయో చూడలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: