గత సార్వత్రిక ఎన్నికలలో అనేక అబద్ధపు హామీలు చెప్పి రైతులను స్త్రీలను యువతను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై  ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల బట్టి తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని సర్వేల ఫలితాలలో వెల్లడవుతున్నాయి. తాజాగా ఇటీవల చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి పింక్ డైమండ్ విషయంలో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు సరైన స్పందన తెలుగుదేశం పార్టీ నుండి గాని చంద్రబాబు నుండి గాని రాకపోవడంతో చంద్రబాబుని వచ్చేఎన్నికలలో పక్కన పెట్టేయాలి అని అనుకుంటున్నారట చిత్తూరు వాసులు.
Image result for chandrababu
మామూలుగా చిత్తూరు జిల్లా అయితే గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో దాదాపు మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కే దక్కేది..ఆ తర్వాత వైయస్ జగన్ పొలిటికల్ ఎంట్రీ తో  కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బ‌లంగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికలలో కూడా 14 అసెంబ్లీ సీట్ల‌లో 8 సీట్లు వైఎస్ఆర్‌సిపి గెలుచుకుంది చిత్తూరు జిల్లా లో. ఈ నేపథ్యంలో త‌న‌ను ఎందుకు త‌న సొంత జిల్లా ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని బాబు ఆవేద‌న చెందుతున్నారు.
Related image
దీంతో బాబు చేయించిన తాజా స‌ర్వేలో దిమ్మ‌తిరిగే రిజల్ట్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. చిత్తూరులో టీడీపీ ప‌రిస్థితి మ‌రి దారుణంగా ఉంద‌ని,అక్క‌డ నాయ‌కులు అవీనితి బాగా పెరిగింద‌ని తెలుస్తుంది. ప్ర‌జ‌ల‌లో చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పోయింద‌ని ,రైతులు కూడా న‌మ్మే ప‌రిస్థితి లేక పోవ‌డంతో ఈసారి జిల్లాలో టీడీపీ గెల‌వ‌డం అసాధ్యంగా క‌నిపిస్తుంద‌ని బాబు స‌ర్వేలో తేలింది.
Image result for chandrababu
రిజల్ట్ చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాకయ్యారు...వెంటనే అక్కడ ఉన్న టిడిపి నాయకులను పిలిచి చీవాట్లు పెట్టారు అని సమాచారం. అంతేకాకుండా 2019 ఎన్నికల లోపు జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేలా శ్రద్ధ తీసుకోవాలని ఆ నాయకులతో అన్నారట. మరి వచ్చే ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: