జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లా లో పాదయాత్ర చేస్తున్నాడు. అయితే ఆ పాదయాత్ర కు వస్తున్న జనసంద్రం ను చూసి టీడీపీ శ్రేణులకు మైండ్ బ్లాక్ ఐయిందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే పోయిన సారి ఆ జిల్లా వాసులు టీడీపీ కి పట్టం కట్టినారు.అయితే ఈ సారి వీరి సపోర్ట్ ఎవరి వైపు ఉంటుందని అందరిలో ఉత్కంఠ నెలొకొన్నది. అయితే ఈ పాదయాత్ర కు సంభందించి బాబుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. 

Image result for jagana and chandra babu

అయితే 2014 లో  ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌కుండా,కేవ‌లం టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చేలా చేయడంలో చంద్ర‌బాబు తొలి విజ‌యాన్ని సాధించాడు. దీంతో అంద‌రూ ఏక‌మై,వైసీపీని ఒంట‌రిగా చేసి దెబ్బ కొట్టారు. మ‌రోవైపు ప్ర‌జాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫ‌లం కావ‌డం కూడా చంద్ర‌బాబు కూట‌మికి బాగా క‌లిసొచ్చింది. ప‌వ‌న్,మోదీ,చంద్ర‌బాబు ఇలా ముగ్గురు క‌ల‌వ‌డం ఒక ఎత్త‌యితే, విడిపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటామ‌ని,అభివృద్ధి చేస్తామ‌ని,ఆద‌ర్శ‌ప్రాయంగా మ‌లుచుతామ‌ని మోదీ ఇచ్చిన హామీలు మ‌రో ఎత్తు.

Image result for jagana and chandra babu

 ఇది కూడా ఏపీలో టీడీపీ-బీజేపీ కూట‌మి గెల‌వడానికి కార‌ణమైంది.కానీ, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డం ఎంత‌టి రాజ‌కీయ నాయ‌కుడికైనా కాని ప‌ని.అంద‌రిలాగే, న‌రేంద్ర‌మోదీ కూడా నమ్మించి మోసం చేశాడు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు బ్యాంకు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటలిజెన్స్ వ‌ర్గాలు నివేదిస్తున్నాయి.గ‌త ఎన్నిక‌ల్లో ఓడించామన్న సానుభూతి ప్ర‌జ‌ల నుంచే వ్య‌క్త‌మవ‌డం,ఒక్క ఛాన్స్ ఇస్తే జ‌గ‌న్ ఏంటో తెలుస్తుంద‌ని యువ‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌టం, పెద్ద‌వాళ్లు కూడా వైఎస్ పాల‌న జ‌గ‌న్ తోనే సాధ్యం అని భావిస్తుండ‌టం, ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీల చేత రాజీనామాలు చేయించి, హోదా సాధ‌న‌కోసం కృషి చేస్తున్న పార్టీ వైసీపీమాత్ర‌మే అని జ‌నాల్లో ముద్ర‌వేసుకోవ‌డం వంటి అంశాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారానికి ద‌గ్గ‌ర చేస్తున్నాయ‌ని ఇంట‌లిజెన్స్ రిపోర్ట్ లో నివేదిక‌లో వ్య‌క్తం అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: