లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ తరుపున ఎంపీ గా పోటీచేసి బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ నామారూపాలు లేకుండా పోయిందో అప్పటి నుంచి అతను రాజకీయ సన్యాసం తీసుకోక తప్పలేదు. అయితే లగడపాటి సర్వేలకు మంచి పేరుంది. అయితే ఈ సర్వేలు ఎప్పుడు టీడీపీ కు అనుకూలంగా రావడం అందరికీ సందేహం తెప్పిచ్చేదే..!ఇప్పుడు లేటెస్ట్ గా లగడపాటి రాజగోపాల్ సర్వే వచ్చింది. సేమ్ టు సేమ్ అదే ఫిగర్. 110 సీట్లు. ఒక్క సీటు తేడాగా లేదు. గడచిన నెలా, రెండు నెలలుగా, కృష్ణ, గుంటూరు జిల్లాల కమ్మ సామాజిక వర్గంలో వినిపిస్తున్న ఫిగర్. 

Image result for lagadapati rajagopal

సర్వేల విషయంలో లగడపాటికి మంచి పేరు వుంది. కానీ అలా అని ఈసారి ఉన్నట్లుండి వెలువరించిన ఈ కొత్త సర్వేను ఎంత మాత్రం నమ్మడానికి లేదు. ఏం..ఎందుకని? కారణం ఒక్కటే ఈ సర్వే వచ్చే సమయంలో రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్థితులు. జగన్ పాదయాత్ర కృష్ణ, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ జిల్లాలో కనబరుస్తున్న ప్రభావం. అదే సమయంలో ఈ ప్రభావం కారణంగా ప్రభావితమవుతున్న రాజకీయ జనాలు. పై స్థాయిలో నాయకుల సంగతి ఎలా వున్నా, కింది స్థాయిలో చోటా నాయకులు, కార్యకర్తల్లో తేడా కనిపిస్తోంది.

Image result for lagadapati rajagopal

అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తల్లో అనుమానాలు బయలు దేరుతున్నాయి. ఇదే సమయంలో భాజపాతో పోరు తప్ప, చేస్తున్నది కనిపించడం లేదని కామెంట్లు బయలు దేరాయి. దీంతో గడచిన నెలా రెండు నెలలుగా భాజపా వ్యతిరేక వార్తలతో పేజీలు నింపేసిన తెలుగుదేశం అనుకూల మీడియా, ఇప్పుడు మళ్లీ అభివృద్ది వార్తలను బయటకు తీస్తోంది. ఇటీవలే లగడపాటి వెళ్లి చంద్రబాబును కలిసి స్వీటు తినిపించి మరీ వచ్చారు. కాంగ్రెస్ లో వుండి ఏమీ సాధించలేని లగడపాటి, ఇప్పుడు రాజకీయ నిరాశ్రితుడు. ఆయనకు ఓ అండ కావాలి. అది బాబు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఇలా ఏదో ఒకటి చేయాలి. పైగా లగడపాటి వారి కంపెనీలు అన్నీ కలిసి యాభై వేల కోట్ల అప్పుల్లో వున్నాయి. వాటిపై మోడీ ఏ చర్య తీసుకున్నా, దానికో అండ కావాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: