ambati ramababu vs niti aayog కోసం చిత్ర ఫలితం

మన మైత్రికి గండిపడొచ్చు. స్నేహం శత్రుత్వం కావచ్చు. కనీస మర్యాదలు మరిచిపోవటం సంస్కారం కాదు. ముఖ్యంగా జాతికి నేతలకు అది అవసరం. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వారిని బలపరచే మీడియా ప్రవర్తిస్తున్న తీరు సర్వదా ప్రశార్ధకంగా మారింది. ఆదివారం 'నీతి ఆయోగ్' సమావేశానికి చందబాబు వెళ్తున్న సందర్భంగా శనివారం టిడిపి వారి మద్దతు చానళ్ళు మొత్తం ఈ క్రింది వార్తలతో హోరెత్తి పోయాయి. అవేమంటే: 
సంబంధిత చిత్రం
చంద్రబాబు వెళ్లారంటే ఇక ఢిల్లీలో మామూలుగా ఉండదు 
ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతాయి 
ఇంతకాలం అంటే ఎన్డీఏతో మైత్రితో కలిసి ఉన్నారు కాబట్టి మర్యాద కోసం ఊరుకున్నాడు కానీ ఇప్పుడు:
మోడీకి బాబు చేతిలో మూడింది 
రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఒక్కదెబ్బతో తీసుకురాబోతున్నారు 
అవసరమైతే మోడీని సైతం నేరుగా కడిగి పారేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీయబోతున్నారు 
కళ్లు పెద్దగా చేసి చండ్ర నిప్పులు కురిపిస్తూ హెచ్చరిస్తారు
ఖబడ్దార్ మోడీ! అంటూ తీవ్ర వీరావేశంతో స్టేట్మెంట్లు ఇస్తారు
కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని శాపనార్థాలు పెడతారు

అంటూ ఒక వర్గం మీడియా టివి ముందు ఊహకందని ఊకదంపుడు కార్యక్రమాలు వారి పత్రికల్లో పేజీల పేజీలు తామర తంపరగా దంచేసి 'కుడిఎడమల డాల్ కత్తులు మెరయగ' అని హడావిడి చేస్తూ టెలివిజన్ డబ్బాల తెరలపై కథనాలు ఫుంకాలు ఫుంకాలుగా ఫుల్లుగా పొంగి పొరలేలాగా చేశాయి. అంతా ఎలా ఉందంటే చంద్రబాబు డిల్లీ వెళితే అసలు ప్రధాని నరెంద్ర మోడీ గతేమిటి? అనేలాగా జనాల్లో గుబులు రేపారు దుమ్ములేపారు. 
 
అయితే నేడు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నరెంద్రమోడీని నిజం గానే నిలదీశారా? కడిగి పారేశారా? ఇదే విషయాలపై తనకే స్వంతమైన ప్రత్యేక స్పందించారు వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.



నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ నిలదీసింది, నరెంద్ర మోడీని కడిగేసింది ఇదయ్యా! అంటూ చంద్రబాబు–నరెంద్రమోడీతో కరచాలనం చేస్తున్న ఫోటోను చూపించారు అంబటి రాంబాబు. ఆ ఫోటోలో నరెంద్ర మోడీ ఎలా ఉన్నారు-మన చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు-చూడండి లోలోపల ఉన్న భయాన్ని దాచుకుంటూ బాబు నవ్వుతున్నారని "ఏడవలేక నవ్వినట్లున్న" ఆ ఫోటోలు చూపిస్తూ చెప్పుకొచ్చారు అంబటి. 

చిత్రం చెప్పిన చంద్రబాబు డిల్లీ యాత్ర కథలు - మద్దతు మీడియాతో చిడతల వాయింపులు

పూర్తిగా రక్త తిలకం దిద్ది నీతీ ఆయోగ్ కు వెళ్ళటాన్ని సమర రంగానికి వెళ్ళి నరెంద్ర మోడీకి అనే శత్రువును సమరంలో తుద ముట్టించ బోతున్నట్టు చాలా హంగామా చేసింది పసుప్పచ్చ మీడియా. అయితే అక్కడ జరిగిందే మంటే అయితే నరెంద్ర మోడిని చూసిన చంద్రబాబుకు నరాలు జివ్వుమన్నాయి. నడుం వంగిపోయింది. ముఖంలో రక్తం ఇంకి పోయింది. కాళ్ళు కీళ్ళు  లయ తప్పాయి. ముఖంలో ప్రేతకళ ఉట్టిపడింది. ఇందులో అబద్దం లేదు చిత్రం చూస్తే తెలుస్తుంది. అదీ అక్కడ బాబు గారి హీన దీన దయనీయ పరిస్థితి. 


చిత్రం చెప్పిన చంద్రబాబు డిల్లీ యాత్ర కథలు - మద్దతు మీడియాతో చిడతల వాయింపులు

చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు అని మొదలు పెట్టిన అంబటి వాటికి తాజా సంఘటనలు సాక్ష్యాలని పేర్కొన్నారు. బాబు డిల్లీ వెళ్ళేటప్పుడు చంద్ర బాబు అనుకూల మీడియాను చేసిన హాడాఉడిని గుర్తుచేస్తూ దానిని కూడా వాయించిన అంబటి, "రాజువెడలె రవితేజము లలరగ.. "అంటూ చంద్రబాబు ఢిల్లీ యాత్రపై కథనాలు రాసుకొని వచ్చాయని కాని జరిగింది ఇదని సెటైర్స్ వేశారు! చిత్రం చెప్పిన కథను చూపించారు. 


మోడీ ముందు కత్తివేటుకు నెత్తురు చూక్క ఉంటే ఒట్టు - మన హీరో మొహంలో: బిక్క చచ్చిన ముఖాలతో చంద్రన్న మమతక్క 


ఈ ఆర్టికిల్ ముఖచిత్రం చెప్పిన కథలో మోడీ చంద్రబాబుకు ఎడమచేతి కరచాలనం చేస్తున్నట్లుంది. రైట్ రాయల్ గా ఆధునిక సార్వభౌముడు లాగా మోడీ బాడీ లాంగ్వేజ్ ఉండగా - సైనికులకు చిక్కి ఖైదీ చేయబడి సార్వభౌముని వద్దకు తేబడ్ద సామంతరాజులాగా  రక్తం ఇంకిన ముఖంతో, బెదిరి, భీతిల్లిన ముఖంతో నిస్సత్తువ ఆవరించిన దేహంతో ఒక ప్రత్యేక కలవరపడుతున్నబాడీ లాంగ్వేజ్ తో చంద్రబాబు దిక్కుతోచక దిక్కులు చూస్తున్న మమతక్క 



ఆంధ్రప్రదేశ్ లోనూ, అమరావతి లోనూ మాత్రం, మోడీని కడిగేస్తాను, నిలదీస్తాను అని చెప్పుకునే చంద్రబాబు, ఢిల్లీ వెళ్లి మోడీ ముందు మోకరిల్లటం సన్నాయి నొక్కులు నొక్కుతూ, వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నారని తెలిపారు. వీటిని లాలూచీ రాజకీయాలు అనక మరేమంటారని అంబటి ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మరింత డోసు పెంచిన అంబటి, నీతీ అయోగ్ సమావేశంలో మోడీని కడిగి పారేస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు, తన అనుకూల మీడియా, మరోసారి ఐదుకోట్ల ఆంధ్రులను దారుణంగా మోసం చేశారని అన్నారు.


చంద్రబాబు అనే వ్యక్తి పోరాటాలు చేసే రకం కాదని, అందితే కాళ్ళు, లేకుంటే జుట్టు పట్టుకునే ఒక వెరైటీ సరుకని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదని అంబటి తెలిపారు. నీతి ఆయోగ్‌ సమావేశం వల్ల రాష్ట్రానికి ఏం? ఒరిగిందో తెలియదు కానీ ఈ వేదికగా బీజేపీ-టీడీపీల లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని అంబటి తెలిపారు.
NiTi ayog meeting news కోసం చిత్ర ఫలితం
అయితే ఇవన్నీ ఇక్కడే. మోడీకి దూరంగా ఉన్నంతవరకే. మోడీ కనబడగానే బాబు వెన్ను వంగిపోతుంది. ముఖం చింతాకంత   అయిపోతుంది. ఎక్కడలేని భయం హృదయంలో ఉప్పొంగుకొస్తుంది. ఎగబడి మరీ కరచాలనం ఇస్తారు. పాదాభివందనం ఒక్కటే తక్కువ. 
సంబంధిత చిత్రం
ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ మీటింగ్ లో చంద్రబాబు బండారం ఇలా మరోసారి బయటపడింది. సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడతారనుకున్న చంద్రబాబు, మోడీని చూడగానే మత్తు తిమ్మిరి మొత్తం దిగిపోయి ప్రత్యేక హోదా సంగతి దేవుడెరుగు.. నరెంద్ర మోడీ తనవైపు చూసి ఒక నవ్వు నవ్వితే అదే పదివేలు అన్నంతగా ఆరాటపడ్డారు చంద్రబాబు. 
NiTi ayog meeting news కోసం చిత్ర ఫలితం
ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతూ బీజేపీ-వైసిపి ఒక్కటయ్యాయంటూ తెగ విమర్శలు చేసిన చంద్రబాబు, ఢిల్లీలో మాత్రం మరోసారి దోస్తీకి అర్రులుచాచినట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు బీజేపీతో కాపురం చేసి తెగతెంపులు చేసుకున్న ఛంద్రబాబు పట్టుమని 6 నెలలు కూడా ఆగలేకపోతున్నారు. మీతో కాపురం మాకు చాలా అవసరం అన్నంతలా మోడీకి సాగిలపడ్డారు. 
NiTi ayog meeting news కోసం చిత్ర ఫలితం
నిజానికి నీతిఅయోగ్ సమావేశం అనేది కేవలం పైకి చెప్పుకునే ఒక తతంగం మాత్రమే. అంతకంటే తన వ్యక్తిగత ప్రయోజనా ల పనిమీదే చంద్రబాబు ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మోడీ-బాబు మధ్య విడిగా భేటీ జరిగినట్టు సమాచారం. తనపై సీబీఐ దాడులు జరుగుతాయని, ఇప్పటికే ఉన్న పలు పాత కేసుల్ని బీజేపీ నేతలు తిరగదోడే అవకాశం ఉందనే వార్తల మధ్య, నీతి అయోగ్ సమావేశాన్ని ఇలా తన వ్యక్తిగత భేటీకి చంద్రబాబు వాడుకున్నట్టు తెలుస్తోంది. కేవలం ఈ కేసులకు భయపడే, గట్టిగా వినిపించాల్సిన ప్రత్యేక హోదా వాదాన్ని పూర్తిగా పక్కన పడేసినట్టు సమాచారం.  రాష్ట్రానికి వచ్చిన తర్వాత తన అను కూల మీడియాతో తిమ్మిని బమ్మిని చేసే వ్యూహం ఎలాగూ ఉంది కాబట్టి, చంద్రబాబు ఇలా తెగించారని అనుకోవాలి.

ambati ramababu vs niti aayog కోసం చిత్ర ఫలితం

రాజ్దీప్ సర్దేశాయ్, శెఖర్ కపూర్ లాంటి ప్రముఖ జర్నలిస్టులు (మోడి వ్యతిరెఖులుగా పేరుపడ్డవారు) కూడా ఈ సారి చంద్ర బాబు రెండు రకాల తీరును అంటే ఇక్కడ ఏపిలో - అక్కడ డిల్లీలో తీరుపై సెటైర్లు వేశారు.  


చంద్రబాబు డిల్లీ టూర్ తుస్సుమంది-సిపిఐ రామకృష్ణ

ముఖ్యమంత్రిపై సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ వ్యంగ్య కామెంట్ చేశారు. ప్రధాని మోడీ ఎడమచేయి కరచాలనం చేస్తేనే బాబు పొంగిపోయినట్లుగా కనిపించారని అన్నారు. చంద్రబాబు ఇకనైనా ఇలాంటి డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు.చంద్రబాబు డిల్లీ టూర్ తుస్సుమందని ఆయన అన్నారు. చంద్రబాబు డిల్లీ పర్యటనతో భూగోళం బద్దలవుతుందన్న విదంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని, చివరికి తుస్సుమందని ఆయన అన్నారు. అసలు ఎడమచేయి ఇస్తేనే చంద్రబాబు ఇలా  చేశారు, కుడి చేయితో కరచాలనం చేసి ఉంటే చంద్రబాబు ఎగిరి గంతేసేవారని ఎద్దేవ చేశారు.

NiTi ayog meeting news కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: