ఆర్ధికనేరగాళ్ళ తీరు దర్యాప్తు సంస్థలకు సైతం అంతుబట్టకుండా తయారైంది. దేశ బాంకింగ్ వ్యవస్థను అవస్థల పాలు చేసి విదేశాలకు చెక్కేసిన  'విజయ్ మాల్యా'  రైట్ రాయల్ గా లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతూ భారత్ నే చాలంజ్ చేస్తున్నాడు. అదే దారిలో దేశ బాంకింగ్ వ్యవస్థను తప్పు దారి పట్టించి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ వ్యవహారం "క్రైమ్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌" ను తలపిస్తొంది.

 

అంతుపట్తని విషయం - అన్నింటికి మించి పాస్‌-పోర్ట్‌ను రద్దు చేసినా అతను అన్ని దేశాల మీదుగా ఎలా ప్రయాణించ గలిగాడన్నది మిస్టరీగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి తన భండారం బయట పడుతుందని భారత సరిహద్దులను దాటాడు.

 nirav modi passport mystery కోసం చిత్ర ఫలితం

ఈ విషయం తెలిసిన వెంటనే ఫిబ్రవరి 15న భారత విదేశాంగ శాఖ నీరవ్ మోడీ పాస్‌-పోర్ట్‌ను రద్దు చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ ఇంటర్‌-పోల్ సాయంతో రెడ్-కార్నర్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ నీరవ్ మోడీ సింగపూర్, బ్రిటన్ ఇప్పుడు బ్రస్సెల్స్‌కు ఎలా వెళ్లగలిగాడన్నది సాల్వ్ చేయలేని ఫజిల్‌గా మారింది. అతని వద్ద నకిలీ పాస్‌-పోర్ట్ ఉందని కాదు కాదు సింగపూర్ పాస్‌-పోర్ట్‌ ఉందని దాని సాయంతోనే దేశాలు మారాడని ప్రచారం జరిగింది.

 nirav modi passport mistery కోసం చిత్ర ఫలితం

అయితే విదేశాంగశాఖకు చెందిన అత్యున్నత అధికారుల వాదన మరోలా ఉంది. నీరవ్‌కు తొలుత ‘ణ్’ సిరీస్‌ పాస్‌పోర్ట్‌ను జారీ చేశామని, అది నిండిన తర్వాత ‘Z’ సిరీస్‌‌కు చెందిన పాస్‌-పోర్ట్‌ను జారీ చేశామని తెలిపారు. పారిశ్రామిక వేత్త కావడంతో అతని పాస్‌-పోర్ట్ త్వరగా నిండుకునేదని, తరచూ దానిని రెన్యువల్ చేయించు కోవటం వల్ల నీరవ్ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాస్‌-పోర్ట్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. తద్వారా నాలుగు నుంచి ఐదు పాస్‌-పోర్ట్‌లు వుండివచ్చని, వాటి సాయంతో టికెట్ సంపాదించాడేమో అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 nirav modi passport mistery కోసం చిత్ర ఫలితం

వ్యూహాలతో ఆరి తేరిన ఆరధిక నేరగాళ్ళ వద్ద ఎన్ని పాస్-పోర్టులు (రెన్యువల్స్ తో కంటిన్యూ అవుతూ) ఉన్నయో తెలియక పోవటం ఆశ్చర్యకరం. ఇందులో ఏమైనా మతలబ్ ఉందా? 

nirav modi passport mystery కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: