ఈ మద్య బీజేపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ..సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.  రీసెంట్ గా ఓ బీజేపీ నేత ప్రభుత్వ అధికారుల కన్నా వేశ్యలే నయం అని..వారు డబ్బు తీసుకొని సుఖం ఇస్తారని..కానీ అధికారులు డబ్బు తీసుకొని తిప్పుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు.  మరో బీజేపీ నేత ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ పై చెయి చేసుకున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తాజాగా మరో బీజేపీ నేత ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.
Image result for gouri lankesh
గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రధాని మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై  శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ స్పందిస్తూ..కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయన్నారు. అప్పుడెవరూ కాంగ్రెస్‌ను తప్పుబట్టలేదని, కానీ కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
Image result for sri ram sena pramod muthalik
ఆయన ఆ మాట అనగానే కార్యకర్తలు కొందరు జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినదించారు. దాంతో దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చనిపోంది ఓ ప్రముఖ జర్నలిస్ట్ అని..అందులోనే ఓ మహిళ అని.. ప్రమోద్ ముథాలిక్ మాత్రం ఆమెపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో..ప్రమోద్ వెనక్కి తగ్గారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే అలా అన్నాను తప్పతే, లంకేశ్‌ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: