రాజకీయాలలో గండర గండడు ఏపీ సీయం చంద్రబాబును అసలు నమ్మలేమంటూ బాంబు పేల్చారు   సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బాబుకు తన స్వార్ధ రాజకీయం తప్ప వేరేదీ పట్టదని పవర్ ఫుల్ పంచ్ వేశారు. నాలుగేళ్ళు మోడీతో కలసి తిరిగి ఇపుడు రివర్స్ గేర్ వేస్తే తప్పు ఒప్పు అవుతుందా బాబూ అంటూ నిగ్గదీసారు. అవినీతిలో నిలువునా టీడీపీ సర్కార్ కూరుకుపోయిందని, ఇక ఇంటికి సాగనంపడమే జనాలు చేయాల్సిన పని అన్నరాయన. 

అందరూ మోడీ భక్తులేనట

Image result for MODI

ఇక్కడ బాబు, జగన్, అక్కడ కేసీయార్ అందరూ మోడీ భక్తులే. అందరూ ఆయనతో అంటకాగినవారేనంటూ నారాయణ గుస్సా  అవుతున్నారు. ఈ పార్టీలకు సొంత రాజకీయం తప్ప దేశం, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ సెటైర్లు వేసారు. మోడీ చేయి అందుకోవాలన్న తహ తహ ఈ ముగ్గురు నేతలలో బలంగా వుందన్నారు. ఒకాయనేమో   ఫెడరల్ ఫ్రంట్ అంటాడు , మరోకాయనేమో మోడీ తో డీ అంటాడు, ఇంకో ఆయన మోడీని ఏం అనకుండానే పాలిట్రిక్స్ చేస్తారంటూ మండిపడ్డారు.

ఏపీలో కొత్త రాజకీయం వస్తుందట
ఏపీలో సరి కొత్త రాజకీయం చూడబోతామంటూ నారాయణ వూరిస్తున్నారు.  టీడీపీ, వైసీపీ జనాలను వంచిస్తున్నాయని, ఈ రెండు పార్టీలు లేని మూడవ పక్ష రాజకీయానికే సీపీఐ ఓటు వేస్తున్నారు. ప్రజల తీర్పు కూడా భిన్నంగా వుంటుందని జోస్యం చెప్పారు. మరి నారాయణ చూపు పవన్ బాబు మీద వుందేమో తెలియదు కానీ, ఇంకా పురుదు పోసుకోని ఆ జనసేనను నమ్ముకుని బలమైన రెండు పార్టీలను తిడుతూ కూర్చుంటే అసలు కే  ఎసరు వస్తుందేమో నారాయణా అంటోంది. కేడర్. ఎంతైనా వామపక్షాలకు  చారిత్రక తప్పిదాలు చేయడం, సరిద్దుకోవడం అలవాటైపోయింది కదా  అంటూ సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: