శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో తిరుగులేని మంత్రిగా చలామణీ అవుతున్న కింజరపు అచ్చెన్నాయుడుకు భారీ షాక్ తగలనుంది. అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి అసెంబ్లీలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇక్కడ నుంచి మరో మారు మంత్రి పోటీకి దిగితే పరాభవం ఖాయంగా కనిపిస్తోంది. పోయిన ఎన్నిక‌ల్లో వైసిపి నేత‌ల‌తో జరిగిన లోపాయికారి ఒప్పందం వ‌ల్లే అచ్చెన్న గెలిచాడ‌న్న ప్ర‌చారం అంద‌రికీ తెలిసిందే.  ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఎక్కడో తేడా కొట్టేలా వుంది. 

అభివృద్ధి శూన్యం
 జిల్లా వ్యాప్తంగా  ఎక్కడ చూసినా అభివృధ్ధి శూన్యం. ఇక మంత్రి గారి నియోజక వర్గంలోనూ అదే సీన్ కనిపిస్తోంది. మంత్రి అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఎ మాత్రం ప్లస్ కాకపోగా తన ఘాటు విమర్శలతో జనాలలో మరింత పలుచన అయిపోయారు. ఎప్పుడూ వివాదాల్లోనే ఉండ‌టం వ‌ల్ల జ‌నాల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది.   చిత్రమేమిటంటే అయన కంటే అయన అన్న కొడుకు నయం అంటున్నారు జనం

కుటుంబంలోనూ విభేదాలు

Image result for ఎర్రన్నాయుడు

గత ఎన్నికల సమయంలో దివంగత ఎర్రన్నాయుడు కొడుకు రాజకీయాలలో జూనియర్.  అయితే నాలుగేళ్ళ క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎంపిగా గెలిచిన త‌ర్వాత బాగా ముదిరిపోయారు. జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ గ‌ట్టి ముద్ర వేసుకున్నారు.  మరీ  ముఖ్యంగా బాబుకు  సన్నిహితునిగా నిలిచారు. ఈ క్రమంలో ఎర్రన్నాయుడు వారసునిగా అటు బాబు ఇటు జనాలు రామ్మొహన్ నే గుర్తిస్తున్నారు. దీంతో సిక్కోలు రాజకీయాలలో అచ్చెన్న హవాకు గ్ర‌హ‌ణం ప‌ట్టింద‌ని జ‌నాలు చెప్పుకుంటున్నారు. దానికి తోడు మంత్రిని అవినీతి ఆరోపణలు కూడా వెంటాడుతున్నాయి. దాంతో  బాబాయి, అబ్బాయి మధ్య విభేదాలు పెరిగిపోతోంది. 
 
ఎమ్మెల్యేగా రామ్మోహన్
వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా రామ్మోహన్ పోటీ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది.  మంత్రి, ఎంపిల మ‌ధ్య వివాదానికి ఆ విష‌యం కూడా ఓ కార‌ణ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక‌వేళ ఎంపి గ‌నుక ఎంఎల్ఏగా రంగంలోకి దిగితే అచ్చెన్న మరింతగా ఇబ్బందులు ప‌డ‌టం ఖాయం. అదే స‌మ‌యంలో శ్రీ‌కాకుళం ఎంపిగా మంత్రి అచ్చెన్నను పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో ఎర్రన్న  కుటుంబంలో  రాజకీయ అగ్గి రాజుకుంటోంది. మళ్ళీ టీడీపీ పవర్ లోకి వస్తే మంత్రిగా కొన‌సాగుదామ‌ని అనుకుంటున్న‌  అచ్చెన్న కలలకు  అబ్బాయే బ్రేక్ వేస్తున్నాడట‌.

జోరుమీదున్న వైసీపీ

Related image

ఇదిలావుండ‌గా టెక్కలి అసెంబ్లీలో వైసీపీ బలం పుంజుకుంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైనా పాగా వేయాలని ఆ పార్టీ గట్టి పట్టుదలగా వుంది. గత సారి చేసిన తప్పులను తిరిగి చేయకుండా చూసుకుంటోంది. అన్నీ కుదిరితే మంత్రి  ఇలాకాలో పాగా వేసి తీరాలని కసిగా వుంది. వైసీపీ అధినేత జగన్  పాదయాత్రతో  జిల్లాలో భారీ మార్పులు జరుగుతాయంటున్నారు. సిక్కోలు లో టీడీపీ కోటలు బీటలు వారుతాయని కూడా వైసీపీ నేతలు ఢంకా భజాయిస్తున్నారు. చూడాలి ఏం  జరుగుతుందో...


మరింత సమాచారం తెలుసుకోండి: