ఈ మద్య దేశ రాజధానిలో అసాంఘిక కార్యక్రమాలు బాగా పెరిగిపోతున్నాయి.  డ్రగ్స్, మాఫియా, హైటెక్ వ్యభిచారం గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది.  ఈ మద్య మాఫిగా గ్యాంగ్ మద్య గన్ ఫైరింగ్ కావడం..పెను కలకలం సృష్టించింది. తాజాగా ఢిల్లీ నగరం తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. ఉత్తర ఢిల్లీలో సోమవారం ఉదయం రెండు గ్యాంగ్‌ల మధ్య కాల్పులు జరగ్గా ముగ్గురు మరణించారని, ఐదుగురికి గాయలయ్యాయని డిసిపి జతిన్‌ నర్వాల్‌ తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంత్‌ నగర్‌ మార్కెట్‌లో తిల్లు తాజ్‌పూర్‌ ముఠా సభ్యులు, జితేందర్‌ హోగి ముఠా సభ్యుల మధ్య ఘర్షణలు మొదలవ్యగా, ఓ ముఠాకు చెందిన సభ్యుడు కాల్పుల్లో మరణించాడు.ఇరువర్గాలకు చెందిన ముఠా సభ్యులు కార్లలో వెళ్లూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. 

ఈ కాల్పుల్లో స్థానిక వ్యక్తి కూడా గాయపడ్డాడని, అతడిని బాబు జగ్‌జగ్జీవన్‌ రామ్‌ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిగాయి అన్న విషయంపై  విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: