ఆంధ్రరాష్ట్ర బిజెపి నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలుగు దేశం ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఆ పార్టీ అనుకూల మీడియా వైసీపీ-బీజేపీ-జనసేన పార్టీలు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తున్నాయని ప్రసారం చేయడంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బిజెపి పొత్తు విషయాన్ని ఖండించారు. జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు.
Image result for purendeshwari
రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం ప్రభుత్వం సమాధానం చెప్పిందంటూ సంచలన వాఖ్యలు చేశారు . ఢిల్లీలో భావసారుప్యం లేని నలుగురు సీఎంలు కలిశారని, వారు ఎంత కాలం కలిసి పనిచేస్తారో చెప్పలేమన్నారు.
Related image
ప్రస్తుతం దేశంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎంతగానో నమ్ముతున్నారని అన్నారు..అంతేకాకుండా మోడీ అధికారంలోకి వచ్చాక భారతదేశం అభివృద్ధిలో ప్రపంచంలో అగ్రదేశాలకు పోటీ ఇస్తుందని పేర్కొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో కూడా మోడీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు పురందేశ్వరి. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారని అన్నారు...అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రాన్ని మరింత నష్టపరిచారు..ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Related image
కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను దుర్వినియోగపరిఛి తమ అవినీతి ఖజానాలను నింపుకున్న తెలుగుదేశం నాయకులు ఆ బురదను కేంద్రంపై జల్లుతున్నారని మండిపడ్డారు పురందేశ్వరి. అవినీతి అబద్ధాలు చెప్పిన నాయకులు ఎక్కువ కాలం అధికారంలో ఉండరని అన్నారు. ఇటువంటి వైఖరి కలిగిన నాయకులకు భవిష్యత్తు గట్టిగా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు పురందేశ్వరి.


మరింత సమాచారం తెలుసుకోండి: