రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు కు ఉన్న అనుభవం మరెవరికీ లేదన్న విషయం ఎంత నిజమో! ఎవరిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలి అన్న విషయంలో కూడా ఆయనకు ఎవరూ సాటిరారు అనే విషయం కూడా అంతే నిజం. గత ఎన్నికలలో భాజపాతో పెట్టుకున్న పొత్తే ఇందుకు నిదర్శనం. నాలుగేళ్లు భాజాపాతో కలిసి మెలిగి ఇప్పుడు హోదా అభాండాన్ని వారిపై మోసి అర్ధాంతరంగా వారితో పొత్తును విరమించుకున్నాడు. 


తమతో పొత్తును విరమించుకున్నాడని బీజేపీ నేతలకు బాధలేదు కానీ పొత్తును విరమించుకుంటూ ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ నేతలు మోసం చేసారని ప్రచారం చేసి మరీ జనాలలో బీజేపీపై ఒక దురభిప్రాయాన్ని ఏర్పరచి బీజేపీ అంటే ఛీదరించుకొనేలా పరిస్థితి ఏర్పాటు చేసి పొత్తును తెంచేశాడు. తామూ తక్కువ కాదన్నట్లు బీజేపీ నేతలు కూడా బాబుకు తమదైన రీతిలో బుద్దిచెప్పాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలో మెల్లగా పాగా వేద్దాం అని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తే హోదా అనే అంశంతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి టైం చూసి దెబ్బగొట్టిన బాబుపై బీజేపీ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. స్వయంగా మోడీనే ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.


ఈ క్రమంలోనే ఏపీకి చెందిన భాజపా నేతలకు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ చీఫ్ అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లు సమావేశం ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు వివరిస్తున్నారట. టీడీపీ అవినీతి భాగోతాలే కాకుండా, హోదాపై పలు మాటలు మార్చిన బాబు ద్వంద నాలుకల ధోరణిని జనాలకు చేర్చి బాబు నిజస్వరూపం బయటపెట్టే ప్రణాళికలను వారికి ఉపదేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఉపదేశాలను అమలుపరచటానికి త్వరలోనే రాష్ట్రమంతటా సభలను ఏర్పాటుచేయాలన్న ఆలోచనల్లో ఉన్నారంట. మొత్తానికి ఈ ఎన్నికలలో కేవలం టీడీపీ ని టార్గెట్ చేయడం వెనుక వైసీపీ తో పొత్తు దాదాపు ఖరారయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: