పార్టీని న‌మ్ముకుని  నాలుగేళ్ళుగా పనిచేస్తున్న నియోజక వర్గ ఇంచార్జిలకు వైసీపీ భారీ షాక్ ఇస్తోంది. ఇప్పటి వరకే మీ చాన్స్, రేపటి ఎన్నికలలో పోటీకి మాత్రం కొత్త వారొస్తున్నారంటూ పక్కన పెట్టేస్తోంది దీంతో వైసీపీ నేతలు ఖంగు తిని డంగై పోతున్నారు. ఎన్నికల వేళ పోటీకి రెడీ అంటూ  డ‌బ్బు సంచులతో సహా దూసుకువస్తున్న బడా నాయకులకు వైసీపీ రెడ్ కార్పెట్ పరిచేస్తోంది. 

రియల్టర్లకు వెల్ కం

Image result for ysrcp & tdp

విశాఖలో పలు అసెంబ్లీ  స్థానాల్లో పోటీ చేయ‌టానికి ప‌లువురు రియాల్టర్లు  రెడీ అవుతున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఏ పార్టీ అయినా ఒకే, సీట్ మాత్రం త‌మాకే అంటూ రాయబేరాలు న‌డుపుతున్నారు. ఈ మధ్యనే నగరానికి చెందిన బడా రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయనకు ఉత్తరం నియోజకవర్గం ఆఫర్ చేశారు. తాజాగా పేరున్న రాజు గారు వైసీపీ తలుపు తట్టారు. అయనకు ఉత్తరం ఇచ్చేసి ఏంవీవీని ఎంపీ టిక్కెట్ కంఫర్మ్ చేస్తున్నారని టాక్. ఈ పరిణామలతో అటు ఉత్తరం, ఇటు ఎంపీ సీట్ ఆశిస్తున్న పార్టీలోని నాయకులు  ల‌బోదిబోమంటున్నారు. 
 
అక్కడా అదే సీన్ 
అలాగే పెందుర్తి సీట్ కి టీడీపీ నుంచి దూకేందుకు రెడీగా వున్న ఎమ్మెల్యే పంచకర్లకు సెలెక్ట్ చేశారని ప్రచారం సాగుతోంది. దీంతో ఇక్కడ చాలకాలంగా పార్టీ ఇంచార్జ్ గా ఉంటూ టిక్కెట్ ఆశిస్తున్న అదీప్ రాజ్ ఫైర్ అవుతున్నారు. ఇన్నాళ్ళ చాకిరికీ ఇదేనా ఫలితమంటూ గోడుమంటున్నారు. టీడీపీ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టికి వైసిపిలో భీమిలీ సీట్ కంఫర్మ్ అయిందని మరో టాక్. ఇక్కడ ముగ్గురు ఇంచార్జ్ లు వైసీపీ నుంచి మారారు. యాదవ సామాజిక వర్గం భీమిలీ సీట్ కోరుతోంది. వారిని పక్కన పెట్టేసి మరీ జంపింగ్ ఎంపీ గారికి ఇస్తే ఎలా అని రేసులో వున్న వారు గుర్రుమంటున్నారు. 

ఇంచార్జిలు ఇంటికే

Image result for తైనాల విజయకుమార్

విశాఖ పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ పోస్ట్ కూడా ఎగిరిపోతోందట‌. అయనను పక్కన పెట్టేసి ఎంవీవీని కొత్త ప్రెసిడెంట్ గా చేస్తూ రేపో మాపో హై కమాండ్ ప్ర‌క‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే వరుసలో మరి కొంత మందికి కూడా షాక్ తప్పదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో పార్టీలో పాత కాపులంతా గుస్సా అవుతున్నారు. ఇక్కట్లు తమకు, టిక్కెట్లు వారికా అంటూ ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: