రాష్ట్రంలో లగడపాటి సర్వే అంటే ఐయస్ఐ మార్కు లాంటిది. ఎందుకంటే ఆయన గతంలో చేపట్టిన సర్వేల ఫలితాలే ఇందుకు నిదర్శనం. కాగా మూడు రోజుల క్రిందట లగడపాటి రాజగోపాల్ బృందం చేసిన ఆర్జీ ఫ్లాష్ సర్వే అంటూ ఒక ప్రముఖ ఛానెల్ సర్వేను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సర్వే ప్రకారం మళ్లీ  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ ఛానెల్ ప్రసారం చేసింది. 


ఇక ఆ సర్వేలో టీడీపీకి 110, వైసీపీకి 60 మరియు జనసేన కు 5 స్థానాలు లభిస్తాయని  తేలిందని సదరు వార్తా ఛానెల్  ప్రసారం చేయడమే కాదు, సంబంధిత పత్రికలలోనూ తెగ ప్రచారం చేసింది. బాబు నిర్దేశానుసారం ఎల్లో మీడియా అలా స్పందించిందో లేక ఎల్లో పార్టీపై ఆ ఛానెల్ అత్యుత్సాహమో కాని మొత్తానికి ఆ ఛానెల్ ఫేక్ రిపోర్టుతో చంద్రబాబు నాయుడు ని మరియు టీడీపీని అడ్డంగా బుక్ చేసింది.          


అయితే ఆ ఛానల్ ప్రసారం చేసినవన్నీ, సంబంధిత పత్రికలలో చూపించినదంతా బూటకమే అని కొట్టిపడేసాడు మాజీ మంత్రి రామచంద్రయ్య. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన సర్వే జరిపిన వార్త నిజమే కాని ఫలితాల సంగతి మాత్రం ఎల్లో మీడియా సృష్టి అని బాంబు పేల్చారు. తాము సర్వే చేసిన సదరు సంస్థను సంప్రదించామని తెలిపిన ఆయన, ఆ సంస్థ మాత్రం ఎల్లో మీడియా బయటపెట్టిన దానికి, తాము చేపట్టిన సర్వే ఫలితాలకు ఎటువంటి పొంతనలేదు అని చెప్పినట్లు వెల్లడిపరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: