చంద్ర బాబు నాయుడు నాయి బ్రాహ్మణుల మీద ఆగ్రహం ప్రదర్సించడం ప్రతి పక్ష పార్టీల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే దీని గురించి ప్రజలు కూడా మండి పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించమని కోరితే చంద్ర బాబు మాట తీరు అందరినీ విష్మయానికి గురి చేసింది. అయితే ఒక సారి చరిత్ర ను గమనిస్తే  అప్ప‌టి ఎన్నిక‌ల‌కు ముందు హైద‌రాబాద్ లోని బ‌షీర్ బాగ్ లో ప్ర‌తిప‌క్షాల‌తో పాటు రైతుల‌పై దారుణంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న‌ను ఎవ్వ‌రూ మ‌ర‌చిపోలేరు. అప్ప‌ట్లో జ‌రిగిన విద్యుత్ ఉద్య‌మం-ప్ర‌తిప‌క్షాల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరు దేశంలోనే సంచ‌ల‌న‌మైంది.

Image result for chandrababu naidu

ఇక‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును మ‌ర‌చిపోగ‌ల‌రా ? ఉద్యోగాల‌కోసం యువ‌త రోడ్డెకితే వారిపై పోలీసుల‌తో ఉక్కుపాదం మోప‌టాన్ని ఎలా మ‌ర‌చిపోతారు ? ఈ విధంగా ప్ర‌తీ వ‌ర్గంతోనూ అప్ప‌ట్లో చంద్ర‌బాబు సున్నం పెట్టుకున్నారు. విజ‌న్ 20-20 పేరుతో ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొట్టిన చంద్ర‌బాబు త‌న‌కు ఏకంగా 20 ఏళ్ళ‌పాటు ఎన్నిక‌ల్లో తిరుగేలేద‌నుకున్నారు. అటువంటిది 2004 ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయి ప‌దేళ్ళు ప్ర‌తిపక్షానికే ప‌రిమిత‌మ‌వ్వాల్సొచ్చింది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌ధ్యంలో ఏదో నరేంద్ర‌మోడి, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తుతో ఎలాగోలా ముఖ్య‌మంత్ర‌య్యారు. నాలుగేళ్ళు గ‌డ‌చిపోయి మ‌ళ్ళీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది.

Image result for chandrababu naidu

ఇటువంటి నేప‌ధ్యంలో రాష్ట్రంలో 2004 వాతావ‌ర‌ణ‌మే క‌న‌బ‌డుతోందా అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఎందుకంటే, ఇపుడు కూడా రుణ‌మాఫీ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌క‌పోవ‌టంతో రైతులు చంద్ర‌బాబుపై మండిపోతున్నారు. హామీ ఇచ్చిన స్ధాయిలో ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌టంతో నిరుద్యోగులు కోపంతో ఉన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వ‌లేదు. ఇక‌, రిజ‌ర్వేష‌న్ల‌పై ఇటు కాపులు,అటు బిసిలు చంద్ర‌బాబుపై క‌త్తులు నూరుతున్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల సంగ‌తైతే చెప్ప‌నే అక్క‌ర్లేదు. కాబట్టి చంద్ర బాబుకు మరలా బ్యాడ్ టైం స్టార్ట్ ఐయిందని చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: