ప్రస్తుతం రాష్ట్రంలో పాలన పడకెక్కింది. 2019 ఎన్నికల సమరాంగణాన గెలుపే ప్రధానంశంగా చంద్రబాబు తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడే సమర సన్నాహాల్లో మునిగితేలుతున్నారు. టిడిపి దీనికి మద్దతు మీడియా సారధ్య బాధ్యత తీసుకొని సమరశంఖం పూరించింది అదీ ఒక సర్వే రూపంలో. దాన్ని ప్రతిపక్షాలు బూటకపు సర్వే అని అబద్ధాల అల్లిక అని చెపుతున్నాయి. అలాగే ఆ సర్వే చేసిన సంస్థ సర్వే చేసినది యదార్ధమనీ-కాని ఆ పత్రిక ప్రకటించిన వివరాలు మావి కాదని ప్రవచించినట్లు వైసిపి నేటలు బయటపెట్తారు. ఇదే నిజమైతే మొత్తం మీద ఎన్నికల సమరశఖం టిడిపి తరపున పూరించిది ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి అని చెప్పవచ్చు.


 అందులో కొన్ని సార్లు ప్రయోగాలు బూమరాంగ్ అవటం సహజం. అదే జరిగిందిప్పుడు:

సంబంధిత చిత్రం


తెలుగు దేశం పార్టీ తన మద్దతు పత్రిక తో బోగస్ సర్వే చేయించి ప్రచారం చేయించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే సర్వే టిడిపికి తలనొప్పిగా ముప్పుగా మారబోతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన నియోజకవర్గమైన బీమిలి లో వ్యతిరేకత ఉందని కావాలని టిడిపినే ప్రచారం చేయించిందని తనను తన పార్టీ నాయకులే ఇలా చేశారని ఆయన భాదపడుతున్నారట. అందుకే ఆయన మంత్రి వర్గ సమావేశానికి కూడా రాలేదని సమాచారం. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా కూడా దీనిపై వార్తలు ఇచ్చిందటే పరిస్థితి ముదిరి పాకాన పడిందనే అనుకోవాలి.విశాఖ జిల్లా పర్యటనకు చంద్రబాబు నాయుడు సందర్భంగా ఇందులో గంటా శ్రీనివాస రావు పాల్గొంటారా? లేదా? అన్నదానీపి ఇప్పుడు ఉత్కంఠగా చర్చఓప చర్చలు జరుగు తున్నాయట.  

 chandrababu plans to shake BJP కోసం చిత్ర ఫలితం

కేంద్రం తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ చంద్రబాబు ఎన్డీయే నుండి బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సంగతి, అలానే టీడీపీ-బీజేపీల మధ్య బందం బ్రేకై ఇప్పుడు మాటల యుద్ధ తీవ్రత పేరిగి యుద్ధం జరుగుతున్న సంగతిని బట్టి చూస్తే రాజకీయ రంగ చతురుడు చంద్రబాబు ఏదో పెద్ద వ్య్యూహం పన్నుతున్నట్టే నంటున్నారు. అయితే చంద్ర బాబు 2019లో బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయటానికి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే బీజేపీకి ఒక చిన్న ఝలక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అదేంటంటే:

chandrababu plans to shake BJP కోసం చిత్ర ఫలితం 

కొద్దిరోజుల్ల రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నిక నాందిగా చంద్ర బాబు తన రాజకీయ వ్యూహ రణ తంత్ర సత్తా ఏమిటో బిజెపికి చూపబోతున్నట్టు సమాచారం. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245 అందులో 4 ఖాళీ ఉండటంతో ప్రస్తుతం ఆ సంఖ్య 241. ఎన్నిక జరిగి ఉపాధ్యక్షుడు కావాలనుకునే వారికి కనీసం 121 ఓట్లు కావాలి. ఇందుకు పూనుకుంటే బీజేపీకి ప్రస్తుతమున్న సొంత బలం 80, మిత్రపక్షాలు, మరి కొన్ని ఇతర మద్దతునిచ్చే పార్టీలు సహకరిస్తే తప్ప బీజేపీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బిజెపి విజయం సాధించలేదు. అందుకే చంద్రబాబు తనదైన శైలిలో బీజేపీకి ఈ సంధర్భంగా ఝలక్ ఇవ్వనున్నారట.

 chandrababu plans to attack BJP in RS deputy chairman election కోసం చిత్ర ఫలితం

అదేంటంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక త్రాటి పైకి తీసుకొచ్చి బరిలోకి దింపి బీజేపీనిచిత్తు చిత్తుగా ఓడించాలని ప్రణాళిక రచించారట. చంద్రబాబుకి జాతీయ రాజకీయాల్లో ఉన్న పలుకుబడి, స్వతహాగా ఆయనకున్న వ్యూహ చతురత, జాతీయ నేతలు, వివిధ పార్టీల నాయకులతో ఉన్న సత్సంబంధాలు ఉపయోగించుకొని బీజేపీ యేతర పార్టీలను ఏకం చేయడం పెద్ద కష్టం కాదని ఆయన వర్గం, మద్దతు మీడియా అభిభాషణగా తెలుస్తుందె. చూట్టానికి బాగానే ఉంది ఈ వ్యూహం.

 

ఇక బీజేపీని గద్దె దించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా అంటే సహజంగానే ముందడుగు వేస్తుంది, దీన్నిబట్టి చూస్తే రాజ్యసభ సాక్షిగా చంద్రబాబు, బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

 chandrababu plans to shake BJP కోసం చిత్ర ఫలితం

తన మద్దతు మీడియా రథ సారధ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ సహకారం లేకుండానే రాష్ట్రం బయట నుండే "బిజెపి" ని చిత్తు చేసే ఈ చంద్ర వ్యూహం కడు రమణీయం అంటున్నారు టిడిపి నాయకులు.

 

ఇంత చంద్ర బాబు చేయగలిగినప్పుడు రాష్ట్రం లోపల ప్రతిపక్ష వైసిపి స్వపక్షంలోని విపక్షంగా మారుతున్న గంటా లాంటి వారు రాష్ట్రంలో బాబుగారి గద్దె పక్కకు గుంజేయరా? అంటున్నారు రాజకీయం తెలిసిన విఙ్జులు.

 chandrababu plans to shake BJP కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: