పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి బీటలువారాయి. మిత్రపక్షం పిడిపికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బిజెపి ప్రకటించడంతో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు వేడెక్కాయి. వెంటవెంటనే రాజకీయ పరిణామాల్లో మార్పులు అతివేగంగా సంభవించి చివరకు మెజారిటీ  కోల్పోయిన పిడిపి ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
j&k governor కోసం చిత్ర ఫలితం
దీంతో ఏ పార్టీకి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే మెజారిటీ లేకపోవడంతో జమ్మూ కశ్మీర్ లో గవర్నర్ పాలన అని వార్య మైంది.  పీడీపీ ప్రభుత్వం ఉన్నఫళంగా  కూలిపోవడం జమ్మూ కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలు ముందుకు రాకపోవడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో  గవర్నర్ పాలన కు కేంద్రం మొగ్గుచూపింది.  గవర్నర్ ఎన్‌ ఎన్‌ వోహ్రా, గవర్నర్ పాలన విధించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు సిపార్సు చేశారు.


దీనిపై అత్యవసరంగా నిర్ణయం తీసు కోవాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్రపతికి విన్నవించారు. ప్రభుత్వం కూలిపోయి 24 గంటలైనా గడవముందే పాలనా బాధ్యతలు గవర్నర్ పంపిన నివేదికను రాష్ట్రపతి పరిశీలించి, ఆయనకు పాలనా బాధ్యత లను అప్పగిస్తూ నిర్ణయం తీసు కున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం గవర్నర్ పాలన కు, రాజముద్ర వేశారు.

president of india 2018 కోసం చిత్ర ఫలితం

మరో వైపు వీలైనంత వేగంగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్  చేస్తున్నాయి  గవర్నర్‌ గా        ఎన్‌ ఎన్ వోహ్రా 2008 లో బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాం లోనే నాలుగోసారి గవర్నర్ పాలన కు వెళ్లడం గమనార్హం. ఎన్‌ ఎన్  వోహ్రా హయంలో తొలిసారిగా 2008 లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించు కోవడంతో 174 రోజుల పాటు గవర్నర్ పాలన సాగింది. ఇక 2015 ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో కొద్ది రోజులు, 2016 లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించడం తో మరోసారి గవర్నర్ పాలనలోకి వెళ్లింది. తాజాగా ఇప్పుడు గవర్నర్ పాలనలోకే వచ్చింది. 

mahabuba mufthi కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం ఆగస్టు 26 వరకు అంటే అమర్‌నాథ్ యాత్ర ముగిసే దాకా గవర్నర్ పాలన సాగే సూచనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆరు మాసాల పాటు గవర్నర్ పాలన కొనసాగించవచ్చు. అంటే ఈ ఏడాది చివరి వరకూ గవర్నర్ పాలన కొనసాగు తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అప్పటికి సాధారణ ఎన్నికలకు మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంటుందని దీంతో జమ్మూ కశ్మీర్ శాసనసభకు కూడా అప్పుడే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 

PDP BJP governmen t break down కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: