భీమిలీలో  ఓడిపోతానని సొంత సర్వే చేయించి తన పరువు తీసిన చంద్రబాబు వైఖరిపై మంత్రి గంటా ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. బాబుకు గట్టి ఝలక్ ఇచ్చేందుకు అయన రెడీ అయిపోయారని టాక్. నిన్నటి అమరావతి కేబినెట్ స‌మావేశానికి కూడా డుమ్మా కొట్టిన గంటా రేపు విశాఖలో సీయం టూర్ కు కూడా ఎగనామం పెట్టాలనుకుంటున్నారు. దీంతో బాబుకు తానెంటో చెప్పకనే చెప్పాలనుకుంటున్నారుట.


గెంటేయాలనుకుంటున్నారా ?
పార్టీ కోసం తాను ఎంతో చేశానని, తనతో పాటుగా అనేకమందిని గెలిపించి 2014లో బాబు సర్కార్ ఏర్పాటుకు కారణమయ్యానని సన్నిహితులతో గంటా  చెబుతున్నార‌ని టాక్. జిల్లాలో పార్టీని బలోపేతం చేశానే తప్ప ఎటువంటి పొరపాట్లూ చేయలేదని, అటువంటి తనపై పార్టీ కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందని వాపోయారట. తాను నిర్దోషి అని విశాఖ భూ కుంభకోణం కేసులో సిట్ నివేదిక పేర్కొన్నా దానిని బయట పెట్టకుండా చేయడంలో మతలబు ఏంటని గంటా ప్రశ్నిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కొందరు నాయకులు రాజకీయాలు చేస్తున్నా హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ గంటా మండిపడుతున్నారు. ఓ పధకం ప్రకారం తనను పార్టీ నుంచి గెంటేసేందుకే కుట్ర జరుగుతోందని గంటా అనుమానిస్తున్నారని భోగట్టా.

Image result for bhimili

భీమిలీ నంబర్ వన్ 
జిల్లాలోని అన్ని నియోజక వర్గాల కన్నా  అభివృద్ధిలో భీమిలీ నంబర్ వన్ గా వుందని గంటా అంటున్నారు. ఎక్కడా జరగని విధంగా వందల కోట్ల రూపాయలతో అభివృధ్ధి పనులు జ‌రిగింద‌ని  తనకు తిరుగే లేని చోట  ఓడిపోతారంటూ ఎలా  చెబుతారని మంత్రి నిలదీస్తున్నారు.  రాజ‌కీయాల్లో త‌న ఎదుగుద‌ల‌ను చూసి ఓర్వేలేక తనను అణచివేసెందుకే ఇలా చేస్తున్నారని మంత్రి  మండిపోతున్నారు.  


ఆ సర్వే భోగస్ 
ఓ చానెల్ ఇటీవల చేసిన ఆ సర్వే భోగస్ అని గంటా కొట్టిపారేశారు. విశాఖ జిల్లాలో పది వరకూ నియోజక వర్గాలలో టీడీపీ అత్యంత దయనీయమైన పరిస్థితిలో వుంటే అక్కడ‌ బాగా గెలుస్తుందని చెప్పిన ఆ సర్వే తప్పుల తడక అని మంత్రి ఫైర్ అవుతున్నారు. ఇలాంటి తప్పుడు స‌ర్వేల‌తో ఎవరిని మోసం చేద్దామని అంటూ  ఆయన గుస్సా అవుతున్నారు.  


దారికి వస్తేనే 
తన పట్ల వ్యతిరేక, కక్ష పూరిత వైఖరి వైఖరిని అవలంబిస్తున్న హైకమాండ్ ను  దారికి  తెచ్చుకోవాల‌న్న‌దే  గంటా ఆలొచనగా సన్నిహితులు చెబుతున్నారు. త‌మ‌ నాయకుడు బలవంతుడు, ఏ పార్టీలో వున్నా గెలుస్తారు. ఇరవయ్యేళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓడని ట్రాక్ రికార్డ్ ని వారు గుర్తు చేస్తున్నారు. హై కమాండ్ అడుగుల బట్టే గంటా తరువాత యాక్షన్ వుంటుందంటున్నారు. మరి, బుధవారం నాడైనా గంటాను బుజ్జగించే చర్యలను అధినాయకత్వం చేపడుతుందో లేదో చూడాలి. ఆలా కాని పక్షంలో ఏకంగా సీయం విశాఖ టూర్ నే గంటా బాయ్ కాట్ చేస్తారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: