రాజకీయమంటే ఇదే మరి. నిన్నటి వరకూ తిట్టుకున్న నోర్లే  విప్పారదీసుకుని మరీ నవ్వుతాయి. కన్నెర్ర చేసిన వాళ్ళే కౌగిలించేసుకుంటారు. విశాఖలో ఇపుడు జరుగుతోంది అదే. ఏకంగా టీడీపీ అధినేతతొనే పెట్టుకున్న మంత్రి గంటా ఇంక అక్కడ ఇమడలేరన్నది ఆ మత్రం రాజకీయం తెలిసిన వాళ్ళకు ఇట్టే అర్ధమయ్యే విషయం. అలిగి ఇంటికే గంటా పరిమితమైనా విశాఖ రాజకీయమంతా ఆయన చుట్టూనే తిరుగుతోంది.  సర్వే పేరిట తననే ఓడించిన టీడీపీ అధినాయకత్వంపై కస్సుమంటున్నారు. అనుచరులైతే సరే సరి. టీడీపీకి  గట్టి ఝలక్ ఇస్తేనే గానీ శాంతించేట్టు లేరు. ఇదే కరెక్ట్ టైం అంటూ ప్రత్యర్థి వైసీపీ టీడీపీ పై బాణాలు ఎక్కుపెట్టెసింది.


గంటా వస్తే ఓకే 

Related image

వైసీపీ పెద్ద తలకాయ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గంటా వైసీపీలో చేరుతానంటే ఓకే చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. మా పార్టీ సిధ్ధాంతాలు నచ్చి వచ్చి చేరుతామంటే ఒకే అంటామంటూ సానుకూల సంకేతాలు పంపేశారు. దీంతో, గంటాకు వైసీపీ బహిరంగ ఆహ్వానం పలికినట్లైంది. తెల్లారితే సీయం విశాఖ వస్తున్న వేళ కోరి మరీ టీడీపీకి వైసీపీ భారీ  షాకే ఇచ్చింది. పార్టీలో అవమాన భారంతో కాపురం చేస్తున్న గంటా గాంగ్ కి ఇది బంపర్ ఆఫరే. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన బొత్స ఇలా అహ్వానం పలికారంటే జగన్ కూడా ఒకే అన్నట్లుగానే భావించాలి. 


విశాఖ ఎంపీ టికెట్ ఆఫర్ 

Image result for ganta srinivasa rao

గంటాకు విశాఖ ఎంపీ టికెట్ ని జగన్ ఆఫర్ చేసారన్న ప్రచారం జిల్లాలో  షికార్ చేస్తోంది. కాపు సామజిక వర్గంలో బలమైన నాయకునిగా గుర్తింపు కలిగిన గంటాను వెంట తెచ్చుకుంటే పంట పండినట్లేనని వైసీపీ   ఆలోచిస్తోంది.  గంటా రాకతో విశాఖలో సరైన నాయకత్వం కూడా సమకూరుతుందని భావిస్తోంది. నిజానికి గత ఎన్నికలలోనే గంటా వైసీపీలో చేరాలి. అప్పట్లో గంటా అడిగినన్ని సీట్లు ఇవ్వలేక జగన్ చేర్చుకోలేదని టాక్. వచ్చే ఎన్నికలు ప్రాణప్రదమైనందువల్ల గంటాను ఎలాగైనా చేర్చుకోవాలని జగన్ పట్టు మీదున్నారని పార్టీ  న్యూస్. 


సరైన సమయంలో చెబుతా

Image result for ganta srinivasa rao

ఇదిలా వుండగా గంటాను కొంతమంది మీడియా మిత్రులు కలసినపుడు తనకు పార్టీలో జరుగుతున్న అవమానాల బాధను ఆఫ్ ది రికార్ద్ గా  పంచుకున్నట్లుగా భొగట్టా. పార్టీ మారుతారా అన్న ప్రశ్నకు సరైన సమయంలో అన్నీ చెబుతానంటూ మంత్రి అనడం విశేషం. అంటే గంటా రూట్ మార్చేందుకు రెడీ అన్నది అర్ధమైపోతోంది. వైసీపీ లో చేరుతారా లేదా అన్నది కొద్ది రోజులలోనే తేలిపోతుంది. మొత్తానికి గంటా టాక్ ఆఫ్ ది ఏపీ పాలిట్రిక్స్ అయిపోయారు. సొంత సర్వే తో మంత్రి కి బీపీ తెప్పిద్దామనుకున్న టీడీపీ కి ఇపుడు గంటా రివర్స్ లో దిమ్మ దిరిగే షాకులు ఇచ్చేస్తున్నారు. కొసమెరుపేంటంటే బొత్స గంటా ఒకే సామజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్. ఈ క్లూ చాలుగా గంటా దారెటో చెప్పడానికి.



మరింత సమాచారం తెలుసుకోండి: