జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటీవల ప్రజా పోరాట యాత్ర అంటూ ఫుల్ టైం రాజకీయాలలో అడుగు పెట్టడం జరిగింది. ఈ నేపద్యంలో జనసేన పార్టీ నాయకులను బలపరచడానికి పార్టీని పటిష్ట పరచడానికి ఉత్తరాంధ్ర జిల్లాలలో యాత్ర చేపట్టారు పవన్. కానీ పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న ప్రజా పోరాట యాత్ర విషయంలో ఒక రాజకీయ నాయకుడి లాగా వ్యవహరించకుండా కేవలం సినిమా నటుడి వల్లే ప్రవర్తించడంతో ప్రజలు అలాగే జనసేన పార్టీ నాయకులు చాలా కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు.
Image result for jagan pawan kalyan
పాదయాత్రలో ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకుల గురించి గాని కేడర్ గురించి గాని ప్రజలకు తెలిసే విధంగా ముందుండి నడిపించాల్సిన పవన్ కళ్యాణ్ అంతా తానే వన్ మాన్ ఆర్మీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో 45 రోజులపాటు జరిగిన ప్రజా పోరాట యాత్రలో అనేక బ్రేకులు మీద బ్రేకులు పవన్ యాత్ర కు పడ్డాయి. పర్యటనలో ఉండగానే కొన్ని రోజులు ఫాం హౌస్‌కు పరిమిత‌మైపోయాడు.
Related image
తర్వాత ఓ రెండు రోజుల పాటు కొనసాగించి తన భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారని చెప్పి రంజాన్ సెలవులు ప్రకటించేశాడు. రంజాన్ అయిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా కూడా పవన్.. తన యాత్ర మళ్లీ ఎప్పటి నుంచో ప్రారంభమ‌వుతుందో ప్రకటించలేదు. యాత్రలో చంద్రబాబు ప్రభుత్వం పై బాగానే పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.
Image result for jagan pawan kalyan
అయితే ఈ క్రమంలో తాజాగా మళ్లీ పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులకు పవన్ అభిమానులకు పవన్ కళ్యాణ్ ఆలోచన అర్థం కావడం లేదు ...దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో కొంతమంది మనోడు జగన్ చెప్పినట్టే నడుస్తున్నాడు  అని అంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే వైసీపీ నేత జగన్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి గతంలో విమర్శించినట్లు పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్స్ ఎక్కువ సినిమాకి తక్కువ అన్న రీతిలో అనమాట...అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: