వెనకటికి ఒక సామెత ఉండేది అది అందరికీ తెలిసే ఉంటుంది. తాను తవ్వుకున్న గుంతలో తానే పడటం మీడియా ద్వారా సర్వే అని చెప్పి చివరకు దానిని ప్రజలు నమ్మక పోవడం తో టీడీపీ నవ్వుల పాలైంది. అడ్డగోలుగా ఇటువంటి సర్వేలు చేయిస్తే ప్రజలు అంత అమాయకులు కాదని సంగతి ఇప్పడూ చంద్ర బాబు నాయుడు కు అర్ధం అయ్యింది. అయితే ఈ సర్వేలో గంటా శ్రీనివాస్ ఓడిపోతాడని చెప్పడం తో మొదటికే మోసం వచ్చిందని చెప్పాలి. 

Image result for chandra babu naidu and ganta srinivas

మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలా రాయడంతో ఆయన అలిగాడట. ఆఖరికి మంత్రివర్గ భేటీకి కూడా రాకుండా తన నిరసన తెలిపినట్టుగా తెలుస్తోంది. ఆయన వెర్షన్ ఏమిటంటే.. ఇదంతా పార్టీనే కావాలని చేయిస్తోంది అని! ఇదే అసలైన ముచ్చట. ఆ పత్రిక సర్వే వెల్లడిస్తే.. ప్రతిపక్షాల వాళ్లు విరుచుకుపడ్డారు, అది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాసుకున్న స్క్రిప్ట్ అని అన్నాయంటే అదో సంగతి. అయితే స్వయానా మంత్రిగారు కూడా అలాగే ఉంటున్నారట. పార్టీనే ఆ సర్వేను వేయించింది అని.

Image result for chandra babu naidu and ganta srinivas

ఇలా టీడీపీకి జాకీలు వేయబోయి కొత్త పంక్చర్ చేసి పెట్టింది ఆ మీడియా సంస్థ. ఇప్పుడు గంటా పాత విషయాలను కూడా గుర్తు చేసుకొంటున్నాడట. రెండేళ్లుగా తనకు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నాడట. ఇప్పుడు తను ఓడిపోతాను అని కూడా పార్టీనే ప్రచారం చేయిస్తోందని.. ఆయన వాపోతున్నాడట. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకీ, కాపులకూ చాలా దూరం పెరిగింది. ఇప్పుడు కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రిపై తెలుగుదేశం అనుకూల పత్రికే ఇలాంటి దాడి చేయడం, దానికి తెలుగుదేశం మద్దతు కూడా ఉందని ఆ మంత్రిగారు భావిస్తూ ఉండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: