రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబునాయుడుకు సంక‌ట ప‌రిస్ధితి ఎదురైంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో టిడిపిని ఎలా గ‌ట్టెంక్కించాల‌న్న‌దే ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇందులో కూడా మ‌ళ్ళీ రెండు స‌మ‌స్య‌లు. మొద‌టిదేమో ఏపిలో అధికారం నిలుబెట్టుకోవ‌టం ఎలాగ ? ఇక‌, రెండోది తెలంగాణాలో పార్టీని బ్ర‌తికించుకోవ‌టం ఎలా ?  తెలంగాణా రాష్ట్రానికి సంబంధించినంత వ‌ర‌కూ చంద్ర‌బాబులో కొంత క్లారిటీ ఉంది. అయితే, అదే క్లారిటి ఏపి విష‌యంలో రాంవ‌టం లేదు.  అదే చంద్ర‌బాబును  బాగా ఇబ్బంది పెడుతోంది. 


చంద్ర‌బాబుకు సంక‌టం

Related image

ఇంత‌కీ విష‌యం  ఏమిటంటే,  వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఎంతో దూరం లేదు.  ఏపిలో అధికారంలో ఉంది కాబ‌ట్టి ఏదో ఒక ర‌కంగా ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్క‌వ‌చ్చ‌నే ఆలోచ‌న చంద్ర‌బాబులో క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్లుగా వ్యూహాలు ర‌చించ‌టంలో చాలా బిజీగా ఉన్న విష‌యం అంద‌రూ చూస్తున్న‌దే.   తెలంగాణా విష‌యంలోనే  ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌టంలో ఏమి చేయాలో చంద్ర‌బాబుకు అంతు చ‌క్క‌టం లేదు. ఎందుకంటే, తెలంగాణాలో టిడిపి ప‌రిస్ధితి చాలా ద‌య‌నీయంగా త‌యారైన విష‌యం అంద‌రూ చూస్తున్న‌దే. 


రాహూల్ గాంధి ఓపెన్ ఆఫ‌ర్

Image result for rahul gandhi

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని బ్ర‌తికించుకోవాలంటే ఏదో ఒక  పార్టీతో పెట్టుకోక త‌ప్ప‌దు. అందుబాటులో ఉన్న స‌మ‌చారం ప్ర‌కారం తెలంగాణాలో  టిడిపి-కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపు ఖాయ‌మ‌నే చెప్పుకోవాలి. ఎలాగంటే, టిడిపిలో ఉన్న నేత‌ల్లో అత్య‌ధికులు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విష‌యంలో సానుకూలంగా ఉన్నారు.  కొంద‌రు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న వారు కూడా ఉన్నార‌నుకోండి అది వేరే సంగ‌తి. టిడిపితో పొత్తుల విష‌యంలో అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటి (ఏఐసిసి) అధ్య‌క్షుడు రాహూల్ గాంధి, తెలంగాణా ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటి (టిపిసిసి) అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చంద్ర‌బాబుకు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని స‌మాచారం. 


ఏపి విష‌యంలోనే అయోమ‌యం 


పొత్తుల విష‌యంలో తెలంగాణాపై ఎంత క్లారిటితో ఉన్నారో ఏపి విష‌యంలో అంత‌కుమించి చంద్ర‌బాబులో అయోమ‌యం క‌న‌బ‌డుతోంది. తెలంగాణాలో అయితే కాంగ్రెస్ ఒక్క‌టే చంద్ర‌బాబుకు చాయిస్. ఈమ‌ధ్య‌నే బిజెపితో పొత్తులు విచ్చిన‌మైంది కాబ‌ట్టి మ‌ళ్ళీ ఆపార్టీతో అవ‌కాశం లేదు. వామ‌ప‌క్షాల గురించి ఆలోచించ‌టం లేదు. టిఆర్ఎస్ తో పొత్తు ఆత్మ‌హత్యా స‌దృస్య‌మ‌నే అనుకుంటున్నారు. అందుక‌ని మిగిలింది కాంగ్రెస్ మాత్ర‌మే. అందులోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కాబ‌ట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే టిడిపికి కూడా లాభ‌మ‌ని అనుకుంటున్నారు. 


జ‌నాలు అంగీక‌రిస్తారా ?

Related image

మ‌రి  ఏపిలో ప‌రిస్ధితే అర్ధం కాకుండా ఉంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని ఇంకో రాష్ట్రంలో పొత్తు కుద‌ర‌దంటే కుద‌ర‌దు.  పొత్తుంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలి. లేకపోతే  ఎక్క‌డా ఉండ‌దు. అలాకాద‌ని ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని మిత్రుల‌లాగ,  ఇంకో రాష్ట్రంలో శ‌తృవుల‌లాగ ఉంటామంటే జ‌నాలు ఎంత వ‌ర‌కూ  అంగీక‌రిస్తారో అనుమాన‌మే.  ఈ అంశంలోనే చంద్ర‌బాబు సంక‌టంలో ఇరుక్కున్నారు. ఈ ప‌రిస్దితి నుండి చంద్ర‌బాబు ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాల్సిందే. ఇక‌, టిడిపికి వ్య‌తిరేకంగా పెట్టిన కాంగ్రెస్ తో పొత్తేంట‌ని కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక‌టుంది. అదేంటంటే, ఇపుడున్నది ఎన్టీఆర్ టిడిపి కాదు, చంద్ర‌బాబునాయుడు టిడిపి అని. 


మరింత సమాచారం తెలుసుకోండి: