మొత్తానికి విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అలకపానుపు దిగిన‌ట్లే క‌న‌బ‌డుతోంది. టీడీపీతో విభేదాలను తూచ్ అనేశారు. టిడిపి అన్న‌ది త‌మ కుటుంబమని ఫ్యామిలీ ఫొటో ఫోజ్ ఇచ్చేశారు. గత మూడు రోజులుగా టీడీపీ హై కమాండ్ కి హైరానా తెప్పించిన గంటా జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప రాయ‌బారాలు, బుజ్జగింపుల‌తో మొత్త‌బ‌డిన‌ట్లే క‌న‌బ‌డుతోంది. పార్టీలో గంటాకు ఎపుడూ ప్రాధాన్యత ఉంటుందని సీయం మాటగా నిమ్మకాయల గంటా చెవిన వేశారు. సర్వేలను పట్టించుకోవద్దని కోరారట‌.

తీవ్ర అసంత్రుప్తితోనే

Image result for ganta srinivasa rao

పార్టీలో బలవంతుడైన మంత్రిగా పేరు పొందిన గంటా  తాను ఓడిపోతానని సర్వే ద్వారా చెప్పించ‌ట‌మేంట‌ని  గుస్సా అయ్యారు. అయితే ఓ వైపు నగరంలో సీయం టూర్ ఉండడం, మరో వైపు పార్టీలో సీనియర్లు సైతం ఓపిక  పట్టాలని సూచించడంతో తాత్కాలికంగానే  వెనక్కు తగ్గరన్నది అంతర్గత సమాచారం. ఇప్పటికీ గంటాకు సీయం మీద, పార్టీలోని పోకడల పట్ల అసంత్రుప్తి ఓ రేంజిలో వుందన్నది టాక్. తన భీమిలీ నియోజక వర్గంలోనే సీయం ప్రోగ్రాం ఉండడం, ఎమ్మెల్యేగా పాల్గొనడం  తన కనీస బాధ్యత అని గంటా భావించిన కార‌ణంగానే  బుజ్జగింపులకు లొంగారని అంటున్నారు.

తాత్కాలికమేనా ?
బాబుతోనే నేరుగా పెట్టుకున్నాక ఎంతటి పెద్ద నాయకుడైన సరెండర్ కావల్సిందే. లేకపోతే బయటకు పోవల్సిందే. గంటా విషయంలో సీయం బాబు సైతం ప్రస్తుతానికి  వెనక్కు తగ్గారని అంటున్నారు. గత రెండేళ్ళుగా గంటాపై బాబు అండ్ కో నిఘా వుందని స‌మాచారం. అవసమైతే గంటా తన రాజకీయం కోసం ఎంత వరకైనా వెళ్తారని హై కమాండ్ అంచనా వేస్తోంది. అయనకున్న అర్ధిక, అంగ బలాలే అదుకు కారణమని వూహిస్తోంది. సీయంగా తాను విశాఖ పర్యటనకు వస్తున్నపుడు జిల్లాకు చెందిన మంత్రే డుమ్మా కొడితే బాడ్ సిగ్నల్స్ వెళ్తాయని బాబు భావించి రాయబార ఘట్టానికి తెర తీశారంటున్నారు. 

వైసీపీ ఆఫర్ తో అలెర్ట్ 


గంటాకు వైసీపీ ఓపెన్ గానే ఆఫర్ ఇవ్వడంతో టీడీపీ అధినాయత్వం అలెర్ట్ అయింది. బలమైన కాపు సామజిక వర్గానికి చెందిన మంత్రి షాక్ ఇస్తే విశాఖ జిల్లాతో పాటు మొత్తం ఉత్త‌రాంధ్ర‌లోనే సమీకరణలు మారుతాయన్న ఆందోళనతోనే బుజ్జగింపులకు దిగారని టాక్. ఇప్పటికి ఇలా వున్నా సరైన సమయంలో చంద్ర‌బాబు త‌ర‌పున‌ సరైన నిర్ణయాలే వుంటాయని టీడీపీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట.

ఎవరు ఎవరినీ నమ్మలేదుగా ?
అటు బాబు కానీ, ఇటు గంటా కానీ ఒకర్ని ఒకరు పూర్తిగా నమ్మని విచిత్ర వాతావరణం వుంది. ఏదో ప్రస్తునానికి ఇలా అన్నట్లుగానే ఇద్దరి వ్యవహారం రాజీ బాట పట్టిందని అంటున్నారు. నిమ్మకాయల బుజ్జగింపుల అనంతరం బయటకు వచ్చిన   గంటా మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడకపోగా ముఖానికి గంటు పెట్టుకున్నట్లుగా బాధతో కనిపించడమే కధ సుఖాంతం కాలేదన్నడానికి ఉదాహరణగా చెబుతున్నారు. సో వైట్ అండ్ సీ 

మరింత సమాచారం తెలుసుకోండి: