గంటా శ్రీనివాసరావు అలక వీడారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన సర్వేపై మనస్థాపం చెందిన మంత్రి.. ఎట్టకేలకు బెట్టువీడారు. తనపై పార్టీలోని కొందరు నేతలే ఇలా వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారనేది గంటా ఫీలింగ్. అయితే మళ్లీ తాను భీమిలి నుంచే పోటీ చేసి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక పార్టీ కూడా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో సందిగ్ధతకు తెరపడింది.

Image result for ganta srinivasa rao

          మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలిలో ఎదురుగాలి వీస్తోందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి – ఆర్జీ ఫ్లాష్ సర్వే వెల్లడించింది. మంత్రిగా ఉన్నా కూడా భీమిలిలో వ్యతిరేకత వీస్తోందని వెల్లడించింది. ఆయన పనితీరుపై అక్కడి ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తేల్చింది. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ సర్వేపై గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానపై తనపై ఇలా కుట్ర చేసి ఈ కథనం రాయించిందేమోననే అనుమానం గంటాలో ఉంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ద్వారా ప్రభుత్వం లీకులివ్వడం కొత్తేమీ కాదు. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారేమో ఆనే ఫీలింగ్ గంటాకు కలిగింది.

Image result for ganta srinivasa rao

          ఒకవేళ తన సీటు మార్చాలనుకుంటే నేరుగా చెప్పాలికానీ ఇలా మంత్రిగా ఉంటూ ఓడిపోతున్నారని లీకులిచ్చి పొమ్మనలేక పొగబెట్టడం కరెక్ట్ కాదనే ఫీలింగ్ కు గంటా వచ్చేశారు. అందుకే కేబినెట్ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే అది సీఎంకు తెలియకుండా రాదని నిర్ధారించుకున్న గంటా.. ఇక టీడీపీలో ఉండడం సరికాదని నిర్ణయించుకున్నారు. అనుచరుల ద్వారా వైసీపీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే జగన్ నుంచి ఆశించిన స్పందన రాలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో గంటా వెనక్కు తగ్గారని తెలుస్తోంది. మరోవైపు చినరాజప్ప జోక్యం చేసుకుని గంటాకు నచ్చజెప్పడం, సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి ఇలాంటివేమీ పట్టించుకోవద్దని సూచించడం, మళ్లీ భీమిలి నుంచే పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. లాంటి పరిణామాలు గంటాను మళ్లీ దారిలోకి తెచ్చాయి.

Image result for ganta srinivasa rao

          అయితే గంటా ఫీలవుతున్నట్టు నిజంగా ఆ సర్వే బూటకమా.. లేకుంటే నిజంగా గంటా పరిస్థితి భీమిలో ఆశాజనకంగా లేదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు చాలా పక్కాగా ఉంటారు. అధిష్టానం దగ్గర గ్రిప్ పెట్టుకోవడమే కాదు.. అనుచరులు, ఓటర్లతో కూడా అంతే సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తారు. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. అంతేకాక అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారనే టాక్ ఉంది. అంతేకాదు.. గంటా ఎక్కడ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. అది వాస్తవం కూడా.! మరి అది ఆయన అదృష్టమో లేకుంటే వ్యూహమో కానీ గంటా మాత్రం ఎప్పుడూ అధికారపక్షమే.! ఇప్పటికైతే గంటా వివాదం సద్దుమణిగింది. మళ్లీ భీమిలి నుంచే పోటీ చేసి సత్తా చాటుతానని గంటా ప్రకటించారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి: