Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 1:12 pm IST

Menu &Sections

Search

"వాట్స్ ఆప్ ను వాట్స్ ఆప్" తోనే జయించిన పోలీస్ బాస్ - హాట్స్ అప్ టు హర్!

"వాట్స్ ఆప్ ను వాట్స్ ఆప్" తోనే జయించిన పోలీస్ బాస్ - హాట్స్ అప్ టు హర్!
"వాట్స్ ఆప్ ను వాట్స్ ఆప్" తోనే జయించిన పోలీస్ బాస్ - హాట్స్ అప్ టు హర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రతి సమస్య దాని పరిష్కారం కవల పిల్లలు. కాకపోతే అవి రెండు ఎక్కడో ఒక చోట కాకుండా  చెల్లా చెదరుగా పడి ఉంటాయి. అయితే వాటిని ఆలోచించి రెండిని వెతికి పట్టుకొని కలిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సమస్యలు చటుక్కున మటుమాయ మౌతాయి. దీనికి కావలసింది ఆలోచన, సహనం, సంయమనం, సమన్వయం. అలా వ్యూహా త్మకంగా ఒక జిల్లా పోలీస్ అధికారి వ్యవహరించి సమష్యను అధిగమించిన తీరుఅభినందనీయం హృద్యమం. సమస్య ప్రమాదకరమైనది. పరిష్కారం అతి సులభం. కాని అమలుతీరే ప్రశంసనీయం.  సమాజంలో రక్షకభట వ్యవస్థ మమేకం అవ్వటం అంటే ఇదే!


జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంలో ఎస్పీ రమారాజేశ్వరి సెంట్-పర్సెంట్ సక్సెస్ సాధించిన సూపర్-పోలీస్-బాస్ అని చెప్పటంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. సోషల్-మీడియాని తన ప్రాంతంలో తనకు అవసరమైన విధంగా  తనదైన శైలిలో నియత్రించి - వాట్సాఫ్ గ్రూపుల ద్వారా గ్రామాల్లో పిల్లల కిడ్నాపర్లు  హంతకులు తిరుగు తున్నారు అంటూ జరిగిన ప్రచారం త్రిప్పి కొట్టి అమాయకులు అన్యాయంగా బలయ్యే పరిస్థితులను వ్యూహాత్మకంగా చతురతతో అతి సునాయాసంగా నిలువరించారు. అయితే ఈ ప్రచారాలను సమర్థ వంతంగా తిప్పికొట్టి జిల్లాలోని ప్రతిగ్రామంలో శాంతిభద్రతలు కాపాడి, హింస చెలరేగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇదే ఇతర జిల్లాలకు జోగులాంబ గద్వాల జిల్లా తేడా.

telangana-news-rama-rajeswari---superintendent-of-

దీంతో రాష్ట్రం లోను, దేశంలోను ఈ తప్పుడు ప్రచారాలతో హింస చెలరేగినా జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం శాంతిభద్రతలు పరిమళించాయి. దీనికి ప్రధాన కారణం జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి ముందు చూపు తో అమలుచేసిన కొన్ని విధానాలు తీసుకున్న చర్యలు. జిల్లాలోని ప్రతి గ్రామంలోను సోషల్-మీడియా తప్పుడు ప్రచారాలపై ముందుగా అవగాహన కల్పించాలని ఎస్పీ బావించారు. ఇందుకోసం జానపద కళలను ఆయుధంగా ఎంచుకున్నారు. పోలీస్ శాఖ ద్వారా జానపద గాయకులు, డబ్బు కళాకారుల ఇలా అందరిచేత ఈ వాట్సాప్ తప్పుడు ప్రచారాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతే కాకుండా గ్రామాల్లో తానే స్వయంగా పర్యటించి ప్రజలు హింసకు పాల్పడ వద్దని సందేశాన్నిచ్చారు. తనే రంగ ప్రవేశం చేయటం తో మిగిలిన పోలీసులు కూడా ఉత్సాహంగా పాల్గొని గ్రామ పెద్దలు, యువకులతో సమన్వయం చెదసుకొని "వాట్స్ ఆప్స్ వాట్స్ ఆప్ తోనే నిలువరించారు"

telangana-news-rama-rajeswari---superintendent-of-

అలాగే గ్రామ గ్రామాల్లోని పెద్దలతో మాట్లాడి వారి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకున్న "వాట్సాప్ గ్రూపు" ల్లోకి స్థానిక పోలీసులు చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో ఈ గ్రూపుల్లో పిల్లల కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు, హంతకు లు తిరుగుతున్నారు అన్న ప్రచారాన్ని తిప్పికొట్టి అమాయకులపై జరుగుతున్న దాడులను నిలిపేయ గలిగారు. గ్రామ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసు లకు సమాచారం అందించాలని ప్రచారం చేశారు. దీంతో జిల్లాలోని దాదాపు 400 గ్రామాల్లో ఎలాంటి దుర్ఘట నలు చోటుచేసుకోకుండా శాంతి బధ్రతల సమస్య తలెత్తకుండా పాలన ప్రశాంతంగా జరిగేలా చూశారు.ఇక పోలీసులను ప్రజల్లో మిళితం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా ఎస్పీ. "కమ్యూనిటీ పోలీసింగ్" పేరు తో ప్రజలే గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షకులుగా మారేలా చేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే పోలీస్ శాఖలో పనిచేసే  సిబ్బందికి ఆన్-లైన్, సోషల్-మీడియా వ్యవస్థలపై విధానాలపై అవగాహన కల్పించారు దీని ద్వారా సైబర్-క్రైంస్ తగ్గించగలిగారు.

telangana-news-rama-rajeswari---superintendent-of-

ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసి జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతి భద్రతలను కాపాడిన ఎస్పీ రమారాజేశ్వరి ఇపుడు దేశంలోని పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి రానున్న సాధారణ ఎన్నికల్లో సైతం ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరక్కుండా, హింస చెలరేగకుండా ఉండాలంటే రమారాజేశ్వరి నడిపించిన బాటలో నే ఈ పోలీస్ వ్య్వస్థను నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె అనుసరించిన వ్యూహాన్ని దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనుసరించి 2019 సాధారణ ఎన్నికల నాటికి శాంతి భద్రత లను అదుపులో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరగేలా చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

telangana-news-rama-rajeswari---superintendent-of-

telangana-news-rama-rajeswari---superintendent-of-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా తీర్పును అపార్థం చేసుకుని  వివాదాస్పద తీర్పు ఇచ్చారని  అంటున్నారు: మేఘాలయ న్యాయమూర్తి
అప్పుడు గెలుపు కోసం రక్షణ రంగాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు జాతీయభద్రతను పణంగా పెడుతుంది
మంచి పాలనలో అరాచక శక్తులు విజృంభిస్తాయి - వీర్రాజు గారి చాణక్య నీతి
అద్దమంత అందం అందలం ఎక్కిస్తుందా! నిధీ!
గెలిస్తే తనవల్లే గెలిచిందంటారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారో చెప్పరు: చంద్రబాబు తీరు
మరోసారి స్వీటీ అనుష్క - డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా చూడబోతున్నామా!
కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి
జగన్ పై హత్యాయత్నం కేసులో కెంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికపై హైకోర్ట్ అసంతృప్తి
రాఫెల్ విషయంలో 36 పిటిషన్లను సుప్రీం ఏకంగా కొట్టివేత - రాహుల్ నోటికి తాళం పడ్డట్టేనా?
టుడే స్పెషల్: రాహుల్ చెంప చెళ్ళుమనిపించి - కాంగ్రెస్ కొంప కూల్చిన - రాఫెల్ డీల్ పై సుప్రీం తీర్పు
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా! తారస్థాయికి చేరుతున్న కామెడీ! ఇక అసహ్యమే! జుగుప్సే!
ఇంత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధి సువిశాల భారతానికి నేతృత్వం వహించగలరా?
ఏపి హైకోర్టు తీర్పు టీటీడీకి చావు దెబ్బైతే - టిడిపికి మరణ మృదంగమా?
₹ 400 కోట్లతో నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం - జనాల్లో తీవ్ర వ్యతిరెఖత టిడిపికి షాక్!
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
About the author

NOT TO BE MISSED