1- 31.52 జ‌న్ ధ‌న్ బ్యాంకు ఖాతాలు

4 Years of Modi Sarkar: Report card

నేరేంద్ర‌మోడి ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత యావ‌త్ దేశంలో 3`.52 జ‌న్ ధ‌న్ బ్యాంకు ఖాతాలు కొత్త‌గా ఓపెన్ అయ్యాయి. 2014-17 సంవ‌త్స‌రాల్లో ప్ర‌పంచం మొత్తం మీద ఓపెన్ అయిన బ్యాంకు ఖాతాల్లో ఒక్క మ‌న దేశంలోనే  55 శాతం ఖాతాలు ప్రారంభ‌మవటం విశేషం.  ఖాతాలు లేని వారితో పాటు నిరుపేద‌ల ఇళ్ళ‌కే ద‌గ్గ‌ర‌కే  బ్యాంకింగ్ సేవ‌లు అందించే ఉద్దేశ్యంతో మోడి ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకు ను కూడా ప్రారంభించారు. 

2-జ‌న్ సుర‌క్షా యోజ‌న‌

4 Years of Modi Sarkar: Report card

ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న ప‌థ‌కం క్రింద దేశం మొత్తంలో 13.25 కోట్ల‌మందికి జీవిత బీమా ద‌క్కింది. అది కూడా ఏడాదికి 12 రూపాయ‌ల‌కే కావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ధాన‌మంత్రి జీవిన జ్యోతి బీమా యోజ‌న ప‌థ‌కం క్రింద ఏడాదికి 333 రూపాయ‌ల‌కే 5.22  కోట్ల కుటుంబాల‌కు జీవిత‌బీమా సౌక‌ర్యం అందింది. అలాగే, అసంఘ‌టిత రంగాల్లోని కోటి మందికి అట‌ల్ పెన్ష‌న్ యెజ‌న ప‌థ‌కంలో బీమా ద‌క్కింది. సీనియర్ సిటిజ‌న్ల‌కు పిఎం వ‌యా వంద‌న యోజ‌న ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌పై 10 ఏళ్ళ‌పాటు  ఏడాదికి 8 శాతం వ‌డ్డి అందుతోంది.  ఈ ప‌థ‌కాన్ని 2020 వ‌ర‌కూ పొడిగించట‌మే కాకుండా పెట్టుబడుల‌ను రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెంచారు. 

3- స్వ‌చ్చ‌భార‌త్ మిష‌న్ 

4 Years of Modi Sarkar: Report card

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిశుభ్ర‌త‌లో భాగంగా దేశం మొత్తం మీద విప్ల‌వాత్మ‌క ప‌ద్ద‌తిలో వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల‌ను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది కేంద్రం. 17 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోని 3.6 ల‌క్ష‌ల గ్రామాల్లో  7.25 కోట్ల వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల‌ను నిర్మించటం ద్వారా నూరు శాతం మ‌రుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని అధిగ‌మించాయి. 2014లో 38 శాతంగా ఉన్న శానిటేష‌న్ 2018కి 83 శాతానికి చేరుకున్న‌ది. 

4-ఆహార భ‌ద్ర‌త‌

4 Years of Modi Sarkar: Report card

80 శాతంపైగా జ‌నాల‌కు ఆహార భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో కేంద్రం కృషిచేస్తోంది.  దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఆహార భ‌ద్ర‌త‌కు హామీ ఇచ్చింది. 2014లో ఆహార భ‌ద్ర‌త 11 కోట్ల మందికి మాత్ర‌మే ద‌క్కేది. 

5- బ్యాంకు ఖాతాల‌కే నేరుగా డ‌బ్బు 

4 Years of Modi Sarkar: Report card

ద‌ళారీ వ్య‌వ‌స్ద‌ను రూపుమాప‌టంలో భాగంగా ఖాతాదారుల‌కు నేరుగా వారి ఖాతాల‌కే డ‌బ్బులు వేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. గ‌డ‌చిన 4 ఏళ్ళ‌ల్లో 431 ప‌థ‌కాల్లోని ల‌బ్దిదారుల‌కు 3,65, 996 కోట్ల‌ను నేరుగా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు జ‌మైంది. 

6-గ్లోబ‌ల్ గ్రోత్ ఇంజ‌న్

4 Years of Modi Sarkar: Report card

ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్ద‌ల్లో భార‌త్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో 2013-17 మ‌ధ్య జిడిపి 31 శాతం పెరిగితే ప్ర‌పంచ జిడిపి అభివృద్ధి 4 శాతంగా న‌మోదైంది. వివిధ ఆర్ధిక ప్ర‌గ‌తి సూచీల‌ల‌లో దేశ ఆర్ధికాభివృద్ధి బాగా ఎక్కువ‌గా న‌మోదైంది. 

7-ప్ర‌పంచ యోగా దినోత్స‌వం

4 Years of Modi Sarkar: Report card

ప్ర‌పంచానికే  మ‌న దేశం యోగ విద్య‌ను నేర్పింది. 21వ తేదీని ప్ర‌పంచం మొత్తం యోగా దినోత్సంగా జ‌రుపుకుంది. 

8- వాతావ‌ర‌ణ మార్పుల‌పై యుద్ధం 

4 Years of Modi Sarkar: Report card

ప్ర‌పంచ వ్యాప్తంగా వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను కాపాడ‌టంపై జరుగుతున్న పోరాటంలో మ‌న దేశం ముందుంది.  ఇదే అంశంపై ప్యారిస్ లో జ‌రిగిన స‌ద‌స్సులో మ‌న‌దేశం కీల‌క పాత్రను పోషించింది. వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను కాపాడ‌టంలో భాగంగా సోలార్ విద్యుత్ పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో 100 దేశాలు పాల్గొన్నాయి. 

9-మాతృభూమి రక్ష‌ణ‌

మాతృభూమి ర‌క్ష‌ణ‌కే అత్య‌ధిక ప్రాధాన్యం. అందులో భాగంగానే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిర్వ‌హించి మ‌న సామ‌ర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. దీర్ఘ‌కాలిక డిమాండైన వ‌న్ ర్యాంకు వ‌న్ పెన్ష‌న్  స‌మ‌స్య ప‌రిష్కారమైంది. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్ద‌ను ఆధునీక‌రించే చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది కేంద్రం. 


10- విదేశీ సంబంధాలు
గ‌డ‌చిన నాలుగేళ్ళ‌ల్లో ప్ర‌పంచ‌దేశాల‌తో మ‌న దేశ సంబంధాల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పు వ‌చ్చింది.  దావోస్ లో జ‌రిగిన  ప్ర‌పంచ ఆర్ధిక స‌దస్సులో దేశ వాణిని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడి వినిపించారు. అంత‌ర్జాతీయ స‌ముద్ర‌జ‌ల వివాదాల ప‌రిష్కార ట్రైబ్యున‌ల్ లో దేశానికి స‌ముచిత ప్రాతినిధ్యం ద‌క్కింది. 
 
11- అంతిరిక్షంలో అద్భుతం
అంత‌రిక్ష వాహ‌క‌ నౌక‌లో ఒకేసారి 104 ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించ‌టం ద్వారా ఇస్రో ప్ర‌పంచ రికార్డును సృష్టించింది. ఈ ఉప‌గ్ర‌హాల్లో అమెరికాకు చెందిన 96, యుఏఇ 1, నెద‌ర్లాండ్స్ 1, స్వ‌ట్జ‌ర్లాండ్ 1, ఇజ్రాయిల్ క‌జ‌కిస్ధాన్ కు చెందిన చెరో ఉప‌గ్ర‌హాలున్నాయి. ఐఆర్ఎన్ఎస్-1జి ని విజ‌యంవంతంగా ప్ర‌యోగించ‌టం ద్వారా  సొంత నావిగేష‌న్ సిస్ట‌మ్ సాంకేతిక గ‌లిగిన దేశాల స‌ర‌స‌న మ‌న‌దేశం కూడా చేరింది, 

12- రైతు ఆదాయాల రెట్టింపుకు మార్గం
రైతుల‌ను బ‌లోపేతం  చేయ‌టంలో భాగంగా వ్య‌వ‌సాయ రంగం ఆధునీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌తీ నిటిబిందువుతో అద‌న‌పు పంట అనే ల‌క్ష్యంతో చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి. నాణ్య‌మైన పంట‌ల‌కు భూసారం బ‌ట్టి అవ‌స‌ర‌మైన ఎర‌వులు అందించేందుకు కృషి. పంట‌ల నిల్వ‌కు గోదాములు, శీత‌ల గిడ్డంగుల నిర్మాణమ‌వుతోంది. జాతీయ వ్య‌వ‌సాయ మార్కెట్లు, 585 ఈ ప్లాట్ ఫార్మ‌ల ఏర్పాటుకు చ‌ర్య‌లు. రైతును ఆదుకోవ‌టంలో భాగంగానే నూత‌న పంట‌ల బీమా విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. 

13- బ‌డ్జెట్లో రికార్డు స్దాయి  కేటాయింపులు
2008-19 లో 11 ల‌క్ష‌ల కోట్ల వ్య‌వ‌సాయ రుణాల ల‌క్ష్యాన్ని పెట్టుకున్న‌ది. ఆక్వా, ఎనిమ‌ల్ హ‌స్బెన్డ‌రీ రంగాల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ. 10 వేల కోట్ల కేటాయింపు. వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లో మౌళిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు రూ. 2 వేల కోట్లు కేటాయింపు. చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హించ‌టంలో భాగంగా రూ. 1290 కోట్ల‌తో నేష‌నల్ బాంబు మిష‌న్ ఏర్పాటు. 

14- రైతుల‌కు మ‌ద్ద‌తుగా చ‌ర్య‌లు 
క‌నీస మ‌ద్ద‌తును పెంచ‌టంతో పాటు రికార్డు స్ధాయిలో పంట‌ల సేక‌ర‌ణ‌కు కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఖ‌రీఫ్ పంట‌ల కోసం పెట్టిన ఉత్ప‌త్తి వ్య‌యానికి 1.5 రెట్లు అధికంగా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను అందిస్తోంది. తృణ ధాన్యాల నిల్వ‌ల‌ను 1.5 ల‌క్ష‌ల ట‌న్నుల నుండి 20 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు పెంచ‌టానికి చ‌ర్య‌లు. 16.24 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల తృణ ధాన్యాల సేక‌ర‌ణ‌కు చ‌ర్యలు. 

15- హ‌ర్ కేత్ కో పాని ల‌క్ష్యాన్ని అధిగ‌మించేందుకు రూ. 40 వేల కోట్లు కేటాయింపు.  28.5 ల‌క్ష‌ల హెక్టార్ల‌ను సాగులోకి తెస్తున్నారు.  మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో నాలుగేళ్ళ‌ల్లో 26.87 ల‌క్ష‌ల హెక్టార్లు సాగులోకి తెచ్చారు. రూ. 5 వేల కోట్లను మైక్రో ఇరిగేష‌న్ ఫండ్ గా కేటాయించారు. వ్య‌వ‌సాయ భూముల్లో సోలార్  వాటర్ పంపుల‌ను బిగిస్తున్నారు. 

16- రైతుల‌కు తోడ్పాటును అందించ‌టంలో భాగంగా ఎల‌క్ట్రానిక్ నేష‌న‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ మార్కెట్ (ఇ నామ్) ఏర్పాటు చేసింది. ఉత్ప‌త్తుల‌కు మంచి ధ‌ర‌ల‌ను అందించేందుకు 585 రెగ్యులేటెడ్ మార్కెట్ల‌లో ఈ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు అయ్యాయి. ఈ ప్లాట్ ఫార్మ్ లో 87.5 ల‌క్ష‌ల మంది రైతులు రిజ‌స్ట‌ర్ అయ్యారు. రూ. 41,591 కోట్ల విలువైన 164. 53 ల‌క్ష‌ల ట‌న్నుల వ్య‌వ‌సాయోత్ప‌త్తుల క్ర‌య విక్ర‌యాలు న‌మోదు చేసుకున్నాయి. 

17- రైతుల‌ను ఆదుకోవ‌టంః పంట‌లు 33 శాతం దెబ్బ‌తిన్నా రైతుల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది కేంద్రం. గ‌తంలో 50 శాతం పంట‌లు దెబ్బ‌తింటేనే ఆదుకునేది కేంద్రం. అధిక వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న పంట‌ల‌కు పూర్తిస్ధాయి క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌లు చెల్లిస్తోంది. మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారంగా రూ. 2.5 ల‌క్ష‌ల నుండి రూ. 4 ల‌క్ష‌ల చెల్లింపు. 

18- రైతుల‌కు అందుబాటులో ఎరువులుః నూరు శాతం వేప‌పూత గ‌ల ఎరువుల వ‌ల్ల భూసారం పెర‌గ‌టానికి, చీడ పీడ‌ల‌ను ఎదుర్కోవ‌టానికి అవ‌కాశం. పంట‌ల దిగుబ‌డి పెంచ‌టానికి నైట్రోజ‌న్ అందుబాటులో ఉంచ‌టం. ఫ‌ర్టిలైజ‌ర్ స‌బ్సిడీ బ‌కాయిల చెల్లింపుకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు. యూరియా ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌టం.

19- పాఠ‌శాల విద్య బ‌లోపేతంః పాఠ‌శాల విద్య‌ను బ‌లోపేతం చేయ‌టం ద్వారా ఉన్న‌త‌మైన దేశ భ‌విష్య‌త్తుకు చ‌ర్య‌లు.  నేర్చుకుంటున్న విద్య భ‌విష్య‌త్తులో ఉప‌యోగ‌ప‌డేట్లుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్ధుల నైపుణ్యాల‌ను వెలికి తీయ‌టంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా 2400 అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ ఏర్పాటు. ప్ర‌తీ ల్యాబ్ కు రూ. 20 ల‌క్ష‌ల కేటాయింపు.  పాఠ‌శాల‌ల్లోని దివ్యంగ విద్యార్ధుల కోసం 50 వేల టాయిలెట్ల నిర్మాణం.

20- యువ‌శ‌క్తిని ప్రోత్స‌హించ‌టంలో భాగంగా యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ కమీష‌న్ 60 విశ్వ‌విద్యాల‌యాల‌కు స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి ఇచ్చింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను అందుకోవ‌టంలో భాగంగా నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయ‌టం. 20 విద్యా సంస్ధ‌ల‌ను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా ప్ర‌క‌టించ‌బోతున్నారు. విద్యా ప్ర‌మాణల పెంపుకు 7 ఐఐటిలు, ఐఐఎంలు, 14 ఐఐఐటిలు, ఒక ఎన్ఐటి, 103 కెవిలు, 63 న‌వోద‌య విద్యాల‌యాలు ఏర్పాటు చేసింది. 

21- సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ 

22- ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌నః 375 రంగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌టానికి 13 వేల కేంద్రాల ఏర్పాటు. కోటి ఔత్సాహికులు శిక్ష‌ణ తీసుకుంటున్నారు. దేశంలోని ప్ర‌తీ జిల్లాలోనూ కౌశ‌ల్ వికాస్ కేంద్రం ఏర్పాటుకు చ‌ర్య‌లు. 

23- క్రీడ‌ల ప్రోత్సాహానికి చ‌ర్య‌లుః శారీర‌క ధారుడ్యం కోసం యువ‌త‌ను క్రీడ‌ల వైపు ప్రోత్స‌హించ‌టానికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. నైపుణ్యం గ‌ల క్రీడాకుల‌కు  8 ఏళ్ళ‌పాటు ఏడాదికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందిస్తోంది. మొద‌టిసారిగా జ‌రిగిన ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర‌పాలిత ప్రాంతాల నుండి 3507 గురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడ‌లను బ‌లోపేతం చేయ‌టంలో భాగంగా 2019-20 వ‌ర‌కూ రూ. 1756 కోట్ల‌ను కేంద్రం కేటాయించ‌నున్న‌ది. 



మరింత సమాచారం తెలుసుకోండి: