వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్ళీ అధికారం అందుకునే  విష‌యంలో చంద్ర‌బాబునాయుడు ఏ రేంజిలో భ‌య‌ప‌డుతున్నారో అంద‌రికీ అర్ధ‌మైపోయింది. మంత్రివ‌ర్గంలోని ఓ స‌హ‌చ‌రుడు అందునా వివాదాస్ప‌ద నేత చంద్ర‌బాబును రెండు రోజ‌ల పాటు ఎంత‌టి టెన్ష‌న్ పెట్టాడో స్ప‌ష్ట‌మైపోయింది. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది ఉండ‌గానే ఈ రేంజిలో చంద్రబాబులోని టెన్ష‌న్ బ‌య‌ట‌ప‌డితే ముందు ముందు ఏమైపోతారో అర్ధం కావ‌టం లేదు. విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలీ నుండి ప్రాతినిద్యం వ‌హిస్తున్న మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతాడంటూ ఓ స‌ర్వే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స‌ర్వే టిడిపికి, చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిల‌బ‌డే మీడియాలో రావ‌ట‌మే అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణ‌మైంది. 


చంద్ర‌బాబుపై అలిగిన గంటా

Image result for ganta srinivasa rao

ఎప్పుడైతే స‌ద‌రు మీడియాలో స‌ర్వే వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిందో వెంట‌నే చంద్ర‌బాబుపై గంటా ఒక విధంగా యుద్ద‌మే ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబుపై అలిగిన గంటా దాదాపు మూడు రోజ‌ల పాటు ఎవ‌రికీ అందుబాటులో లేకుండాపోయారు. చివ‌ర‌కు మంత్రివ‌ర్గ స‌మావేశానికి కూడా హాజ‌రుకాలేదు. దాంతో చంద్ర‌బాబులో టెన్ష‌న్ మొద‌లైంది. గురువారం విశాఖ ప‌ర్య‌ట‌న‌లో గంటా పాల్గొన‌క‌పోతే త‌న‌కు అవ‌మానంగా చంద్ర‌బాబు భావించారు. అందుకే  గంటా అల‌క తీర్చేందుకు మంత్రుల‌ను పుర‌మాయించారు. ఎవ‌రికీ సాధ్యం కాలేదు. హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన్న‌రాజ‌ప్ప‌ను రంగంలోకి దింపారు.

పూర్తిగా త‌గ్గ‌ని ఆగ్ర‌హం

Image result for ganta srinivasa rao

చివ‌ర‌కు నిమ్మ‌కాయ‌ల స్వ‌యంగా గంటా ఇంటికి వెళ్లి న‌చ్చ‌చ్చెప్పాల్సొచ్చింది. వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న‌ది ర‌హ‌స్యం. అయితే, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌టానికి మాత్రం గంటా అంగీక‌రించారు. మాట ప్ర‌కారం ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్నారు కూడా. అయితే, త‌ర్వాత భోజ‌నానికి రావాల్సిందిగా చంద్ర‌బాబు ఆహ్వానించినా గంటా అడ్ర‌స్ లేరు. దాంతో గంటాలో ఆగ్ర‌హం కానీ అల‌క కానీ పూర్తిగా  త‌గ్గ‌లేద‌న్న‌ది అంద‌రికీ  అర్ధ‌మైపోయింది.  స‌రే, త‌ర్వాత చంద్ర‌బాబు కూడా ప‌ట్టించుకోకుండా త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని విజ‌య‌వాడకు చేరుకున్నార‌నుకోండి అది వేరే సంగ‌తి.


ఇంకెంతమంది గంటాలున్నారో ?


ఇక్క‌డ అర్ధం కాని విష‌యం ఏమిటంటే, గంటా దెబ్బ‌కు చంద్ర‌బాబు అంత‌లా ఎందుకు త‌ల్లక్రిందులైపోయాన్న‌దే ? గ‌ంటా శ్రీ‌నివాస్ కు ఆర్దిక, అంగ బ‌ల‌ముండ‌వ‌చ్చు. అంత‌మాత్రాన చంద్ర‌బాబు స‌ద‌రు నత అలిగాడ‌ని తెలియ‌గానే సాగిల‌ప‌డిపోవాలా ?  ఆర్ధిక‌, అంగ బ‌లంలో గంటాకు స‌రిపోయేపాటి  నేత‌లు టిడిపిలో ఇంకెవ‌రూ లేరా ?  లేక‌పోతే గంటా స్ధానాన్ని మ‌రొక నేత‌తో చంద్ర‌బాబు భ‌ర్తీ చేసుకోలేని దీన‌స్ధితిలో ఉన్నారా ? అంటే ప‌క్క పార్టీలో నుండి లాక్కోవ‌ట‌మే కానీ సొంతంగా ఒక్క నేత‌ను కూడా చంద్ర‌బాబు త‌యారు చేసుకోలేడ‌న్న‌ది అర్ధ‌మ‌వుతోంది. ఇపుడంటే గంటా ఒక్క‌డే అలిగాడు స‌రే. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ ఇంకెంత‌మంది గంటాలు అలుగుతారో ? అప్పుడు చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాల్సిందే ?


మరింత సమాచారం తెలుసుకోండి: